విశాఖ రైల్వే జోన్‌పై కీలక అప్డేట్.. త్వరలో ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి ప్రకటన!
visakhapatnam railway zone : విశాఖపట్నం రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టుగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా ఈ మేరకు సమాధానం చెప్పారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

'జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయి. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌కు రూ.2047 కోట్లు మంజూరు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో రూ.70232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.' అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 2024లో విశాఖపట్నంలోని ముడసర్లోవ దగ్గర 52.2 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైల్వే శాఖకు అప్పగించిందని గుర్తు చేశారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కేంద్రం రూ.106.89 కోట్లు మంజూరు చేసిందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 2025 జనవరి నెలలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. 'వీఎంఆర్డీఏ భవనం డెక్ నుంచి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా జనరల్ మేనేజర్, ఇతర అధికారుల నియామకం కూడా త్వరలో జరుగుతాయి. ఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో 2009 నుంచి 2014 మధ్యకాలంలో ఏటా సగటున రూ.886 కోట్లు ఏపీకి కేటాయింపులు జరిగాయి. కానీ 2025-26లో ఏకంగారూ.9,417 కోట్లు కేటాయింపులు చేశాం.' అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
ఏపీలో రైల్వే ట్రాకుల నిర్మాణంలో వేగం పెరిగిందని కేంద్ర రైల్వే మంత్రి చెప్పారు. ప్రతీ ఏటా సగటున 143 కిలోమీటటర్ల మేరకు కొత్త రైల్వే ట్రాక్ పనులు చేపడుతున్నట్టుగా స్పష్టం చేశారు. అమరావతి రైల్వే లైన్ కోసం రూ.2047 కోట్లు మంజూరు చేశామని వెల్లడంచారు. అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి.. ప్రస్తుతం భూసేకరణ ప్రారంభమైందన్నారు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు కలిపి మొత్తం 39 రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వాటి విలువ రూ. 70,232 కోట్లు. గుంతకల్-గుంటూరు డబ్లింగ్ పనులతో పాటుగా విజయవాడ-గూడూరు మూడో లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.' అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


