...
...
Next Story

మార్చి 3 వరకు కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర.. ఇక్కడ తెలంగాణ బోనాల సంప్రదాయం

కొల్లేరులో కొలవైన కొంగుబంగారం పెద్దింట్లమ్మ జాతర మెుదలైంది. మార్చి 3వ తేదీ వరకు కొల్లేటికోటలో ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.

Updated on: Feb 18, 2026, 18:50:15 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పురాతన చరిత్ర ఉన్న దేవాలయాల్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటిగా ఉంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ ఆలయంలో వార్షిక అమ్మవారి జాతర(తీర్థం) ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జాతర జరుగుతుంది. కొల్లేరు ప్రాంతమే కాకుండా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర
కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర

ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది. పెద్దింట్లమ్మ దేవత పూజలు వేంగి తూర్పు చాళుక్య రాజవంశం కాలం నాటి నుంచి జరుగుతున్నాయని నమ్ముతారు. ఈ పండుగలో అతి ముఖ్యమైన ఆచారం జలదుర్గ, గోకర్ణేశ్వరుల దివ్య వివాహం ఫిబ్రవరి 28 రాత్రి సాంప్రదాయ ఆచారాలతో నిర్వహిస్తారు.

కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న చారిత్రాత్మక కోట దిబ్బపై వీరాసనం భంగిమలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నిలబడి ఉంటుంది పెద్దింట్లమ్మ దేవత. ఒకప్పుడు పుణ్యక్షేత్రాన్ని రక్షించిన పురాతన కోటలు అదృశ్యమైన తర్వాత కూడా ఇక్కడ పూజలు అందుతూనే ఉన్నాయి. ఒక గ్రామం-ఒకే దేవత అనే సాధారణ సంప్రదాయానికి భిన్నంగా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 44 కొట దిబ్బలపై నివసిచేవారు పెద్దింట్లమ్మను తమ కుటుంబ దేవతగా పూజిస్తారు. ఇది తరతరాలుగా నిరంతరాయంగా జరుపుకొంటున్న కొల్లేరు జాతర. ఈ తీర్థం ఇక్కడ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు బోనాలు సమర్పించే విషయం తెలిసిందే. అలానే 2020 నుండి కొల్లేటికోటలో తెలంగాణ బోనాలు సంప్రదాయం అనుసరిస్తున్నారు. ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పందిరిపల్లిగూడెం నుండి ప్రబల ఊరేగింపులో బోనాలు కానుకలను తీసుకువస్తారు. భక్తులు బోనాలు, పసుపు, సింధూరం వంటి ఏడు కుండలలో నైవేద్యాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని రాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లుగా ఉన్నది. అంతేకాదు దండి అనే మహాకవి కూడా తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో దీనికి అనేక పేర్లు ఉన్నాయి. కొల్లేటికోట, కొల్లివీటికోట, కొల్హాపురి, కర్ణపురి, కృష్ణా, గోదావరి సంగమదేవ పుష్కరిణీ, సృష్ట్యారంభ పద్మ సరస్సు, దేవపుష్కరిణి, బ్రహ్మ సరస్సు, అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం, కొల్లేరు, కొలనువీడులాంటి పేర్లతో పలికేవారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe