సీసీ కెమెరాల నిఘాలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హైదరాబాద్ నుంచే రియల్ టైమ్ మానిటరింగ్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరబాట్లు కూడా జరగకుండా బోర్డు చర్యలు తీసుకుంటోంది. సీసీటీవీ పర్యవేక్షణతో రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది.

Published on: Feb 18, 2026, 14:56:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TG BIE) ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు రియల్ టైమ్ సీసీటీవీ పర్యవేక్షణను ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లోని కీలక ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో ఏడు నుండి ఎనిమిది సీసీటీవీ కెమెరాల వరకు అమర్చారు. ఈ కెమెరాలు చీఫ్ సూపరింటెండెంట్ గది, కారిడార్లు, ప్రధాన ద్వారం, పరీక్ష కేంద్రాల వెనుక వైపు కవర్ చేస్తాయి. ఆల్‌రెడీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సీసీ కెమెరాల నిఘా
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సీసీ కెమెరాల నిఘా

ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రశ్నపత్రాలు సమయానికి తెరవబడుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షిస్తారు. ఆలస్యంగా వచ్చిన వారిని ట్రాక్ చేస్తారు, పరీక్షా హాళ్లలోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లకుండా చూసుకుంటారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించిన సీసీటీవీ ఫీడ్‌ల ద్వారా తెలంగాణ ఇంటర్ పరీక్షలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఇక ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్లలో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 20 నుండి బోర్డు వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేస్తారు. విద్యార్థులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు డౌన్‌లోడ్ లింక్ అందుకుంటారు. హాల్ టిక్కెట్లను మీసేవా కేంద్రాల నుండి కూడా పొందవచ్చు.

విద్యార్థులు చేతి గడియారాలు ధరించడానికి అనుమతి ఉండదు కాబట్టి, అన్ని పరీక్షా కేంద్రాలలో గోడ గడియారాలు అమర్చుతారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించారు. పలువురు విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు.

టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:

25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)

27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1

02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1

9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1

12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్

17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)

28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2

04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2

6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2

10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2

13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2

16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,

18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More