శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కర్నూలు బస్సు అగ్నిప్రమాదం కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో తాజాగా కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 234 రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోయాయి. ఈ ఫోన్‌ల బ్యాటరీలు పేలడం వల్ల బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.
బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం బైక్‌ను ఢీకొట్టడం. దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లింది. దానిలో నుంచి పెట్రోల్ లీక్ అయింది. బస్సు ద్విచక్రవాహనాన్ని అలాగే ఈడ్చుకెళ్లింది. దీంతో నిప్పు రవ్వలు ముదలయ్యాయి. పెట్రోల్, నిప్పు రవ్వలు కలిసి ప్రమాదానికి కారణం అయ్యాయి. ముదట లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే అందులో స్మార్ట్ ఫోన్ల పార్సిల్ ఉంది.
234 రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారవేత్త పార్సిల్ చేశాడు. బెంగళూరులోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు పంపి.. అక్కడ నుంచి వినియోగదారులకు ఫోన్‌లు సరఫరా కావాల్సి ఉండేది. లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకుని.. ఫోన్లు మంటల్లో చిక్కుకోవడంతో బ్యాటరీలు పేలుతున్న శబ్దం విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకటరామన్ మాట్లాడుతూ.. స్మార్ట్ఫోన్లు పేలడంతో పాటు, బస్సులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కోసం ఉపయోగించే ఎలక్ట్రికల్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని చెప్పారు. ఆ వేడి చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సు నేలపై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని అన్నారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకటరామన్ మాట్లాడుతూ.. స్మార్ట్ఫోన్లు పేలడంతో పాటు, బస్సులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కోసం ఉపయోగించే ఎలక్ట్రికల్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని చెప్పారు. ఆ వేడి చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సు నేలపై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని అన్నారు.
{{/usCountry}}నిజానికి ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాల్లో వ్యక్తిగత లగేజీ తప్ప వేరే పార్సిల్స్ తీసుకెళ్లకూడదు. కానీ వీ కావేరి ట్రావెల్స్ నిబంధనలు గాలికి వదిలేసి.. పార్సిల్ తీసుకెళ్లింది. చాలా ప్రైవేట్ బస్సులు ఇలానే చేస్తున్నాయి. కాస్త డబ్బు కోసం ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నాయి.
మద్యం మత్తులో బైకర్
మరోవైపు ప్రమాదానికి కారణమైన శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరో యువకుడితో కలిసి బైకర్ శివశంకర్ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. బైక్‌ను తీసే విధానం చూస్తే అర్థమవుతుంది తాగి ఉన్నాడని. పెట్రోల్ బంకులోనే ఓసారి కిందపడబోయినట్టుగా కూడా వీడియోలో ఉంది.