మద్యం దుకాణాల దరఖాస్తులతో రూ.2,863 కోట్ల ఆదాయం.. 27వ తేదీన డ్రా!
తెలంగాణలో మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.2,863 కోట్ల ఆదాయం సమకూరింది.
తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి.

రాత్రి వరకు అధికారులు వివిధ కౌంటర్లలో దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు. 95,436 దరఖాస్తులు అందాయి, దీని వలన రూ.2863 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో 2,620 ఏ4 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చివరి తేదీని అక్టోబర్ 23 వరకు పొడిగించారు. చివరి రోజున దరఖాస్తులు భారీగా పెరిగాయి. శంషాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, నల్గొండ వంటి ప్రాంతాల్లో అత్యధిక దరఖాస్తులు చివరిరోజున నమోదయ్యాయని వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు.
అత్యదికంగా రంగారెడ్డి జిల్లాలో 29,430 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా అదిలాబాద్ జిల్లాలో 4,013 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్ ఖరారు చేయనున్నారు. కిందటి ఏడాది 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రూ.2641 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తక్కువ దరఖాస్తులే వచ్చాయి. కానీ దరఖాస్తు రుసుమును పెంచడంతో ఎక్సైజ్ శాఖ రాబడి పెరిగింది. కిందటి ఏడాదితో పోల్చితే రూ.218 కోట్లు అదనంగా వచ్చాయి.
గతంలో రూ.2లక్షలు ఉన్న దరఖాస్తు రుముము ఈసారి మూడు లక్షలుగా చేశారు. రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చాయి. అదే రోజు బీసీ బంద్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో పలువురి అభ్యర్థన మేరకు గడువును 23వ తేదీ వరకు పొడిగించారు. చివరి రోజు వరకు 95,436 దరఖాస్తులు అందాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


