కర్నూలు బస్సు ప్రమాద సమయంలో పేలిన 234 స్మార్ట్‌ఫోన్లు.. లగేజీ క్యాబిన్‌లో పార్సిల్!

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

Published on: Oct 25, 2025, 12:02:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

కర్నూలు బస్సు అగ్నిప్రమాదం కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో తాజాగా కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 234 రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోయాయి. ఈ ఫోన్‌ల బ్యాటరీలు పేలడం వల్ల బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.

బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం బైక్‌ను ఢీకొట్టడం. దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లింది. దానిలో నుంచి పెట్రోల్ లీక్ అయింది. బస్సు ద్విచక్రవాహనాన్ని అలాగే ఈడ్చుకెళ్లింది. దీంతో నిప్పు రవ్వలు ముదలయ్యాయి. పెట్రోల్, నిప్పు రవ్వలు కలిసి ప్రమాదానికి కారణం అయ్యాయి. ముదట లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే అందులో స్మార్ట్ ఫోన్ల పార్సిల్ ఉంది.

234 రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారవేత్త పార్సిల్‌ చేశాడు. బెంగళూరులోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు పంపి.. అక్కడ నుంచి వినియోగదారులకు ఫోన్‌లు సరఫరా కావాల్సి ఉండేది. లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకుని.. ఫోన్లు మంటల్లో చిక్కుకోవడంతో బ్యాటరీలు పేలుతున్న శబ్దం విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకటరామన్ మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్‌లు పేలడంతో పాటు, బస్సులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కోసం ఉపయోగించే ఎలక్ట్రికల్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని చెప్పారు. ఆ వేడి చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సు నేలపై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని అన్నారు.

నిజానికి ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాల్లో వ్యక్తిగత లగేజీ తప్ప వేరే పార్సిల్స్ తీసుకెళ్లకూడదు. కానీ వీ కావేరి ట్రావెల్స్ నిబంధనలు గాలికి వదిలేసి.. పార్సిల్ తీసుకెళ్లింది. చాలా ప్రైవేట్ బస్సులు ఇలానే చేస్తున్నాయి. కాస్త డబ్బు కోసం ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నాయి.

మద్యం మత్తులో బైకర్

మరోవైపు ప్రమాదానికి కారణమైన శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరో యువకుడితో కలిసి బైకర్ శివశంకర్ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. బైక్‌ను తీసే విధానం చూస్తే అర్థమవుతుంది తాగి ఉన్నాడని. పెట్రోల్ బంకులోనే ఓసారి కిందపడబోయినట్టుగా కూడా వీడియోలో ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More