కర్నూల్ జిల్లాలోని చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తుండగా… ప్రమాదానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. బస్సును ఢీకొట్టిన బైక్ పై ఒక్కరు మాత్రమే లేరని… మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. వీరిద్దరూ కూడా మద్యం మత్తులో ఉన్నారని ధ్రువీకరించారు.

అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద స్లీపర్ బస్సును బైక్ ఢీకొట్టింది. బస్సులో 44 మంది ప్రయాణికులు ఉండగా.. 19 మంది సజీవ దహనమయ్యారు. చాలా మంది తప్పించుకోగలిగారు. ద్విచక్రవాహనం బస్సు కిందికి వెళ్లగా… కొంచెం దూరం అలాగే బస్సు ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంజిన్ లో మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం జరిగింది.
మద్యం మత్తులో ఆ ఇద్దరు..!
బైక్ పై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు (శివ శంకర్, ఎర్రి స్వామి) తాగి ఉన్నట్లు ఫోరెన్సిక్ ధృవీకరణలో తేలిందని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. వీరిద్దరూ దాబాలో భోజనం చేశారని… స్వామి మద్యం సేవించినట్లు అంగీకరించారని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంకర్, స్వామి అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల సమయంలో లక్ష్మీపురం గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామంలో దింపడానికి బయలుదేరారు. తెల్లవారుజామున 2.24 గంటలకు కియా కార్ షోరూమ్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద వీరిద్దరూ ఆగారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పెట్రోల్ బంక్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఫలితంగా శంకర్ తన కుడి వైపుకు పడి డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్వామి… శంకర్ ను రోడ్డు మధ్యలో నుంచి లాగి పక్కకు జరిపి చూడగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు గమనించాడని పాటిల్ తెలిపారు.
{{/usCountry}}పెట్రోల్ బంక్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఫలితంగా శంకర్ తన కుడి వైపుకు పడి డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్వామి… శంకర్ ను రోడ్డు మధ్యలో నుంచి లాగి పక్కకు జరిపి చూడగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు గమనించాడని పాటిల్ తెలిపారు.
{{/usCountry}}“అతను(స్వామి) బైక్ ను రహదారి నుంచి పక్కకు లాగాలని ఆలోచిస్తున్నప్పటికీ అప్పటికే బస్సు వేగంగా వచ్చేసింది. బైక్ ను కొంత దూరం ముందుకు లాగుకుపోయింది. వరుసగా రెండు ప్రమాదాలు జరగటంతో పాటు బస్సు మంటల్లో కాలిపోవటంతో స్వామి భయపడిపోయాడు. తన స్వగ్రామమైన తుగ్గలికి బయలుదేరాడు” అని జిల్లా ఎస్పీ వివరించారు.
పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలు బయటికి వచ్చాయి.
మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిపై కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.