కృష్ణా జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. గతంలో ప్రేమించిన వ్యక్తి ద్రోహానికి ఒడిగట్టి, వ్యక్తిగత క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. అంతేకాదు భర్తకు వాటిని పంపి ఆమె కాపురంలో నిప్పులు పోశాడు. బాధితురాలి జీవితం నాశనమవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె కుటుంబ సభ్యులు, సదరు మాజీ ప్రియుడికి విజయవాడ వీధుల్లో గట్టి గుణపాఠం చెప్పారు.

అవనిగడ్డ ప్రాంతానికి చెందిన బాధిత యువతి, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చింది. అదే సమయంలో అవనిగడ్డకే చెందిన నిఖిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఒకే ఊరివారు కావడంతో మొదలైన ఆ పరిచయం కొద్దిరోజులకే ప్రేమగా మారింది. ఆ నమ్మకంతోనే వారు కొన్నిసార్లు సన్నిహితంగా గడిపారు. అయితే ఆ సమయంలో సదరు యువతికి తెలియకుండానే నిఖిల్ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తన ఫోన్‌లో భద్రపరుచుకున్నాడు.
కాలక్రమేణా మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సదరు యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆమె వివాహం చేసుకుని విజయవాడలో భర్తతో కలిసి కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించింది. అయితే నిఖిల్ మనసులోని సైకో ప్రవర్తన ఆమెను నీడలా వెంటాడింది.
ఆమెకు వివాహమైందని తెలిసినప్పటికీ.. నన్ను కలవాలి, నాతో మళ్ళీ సన్నిహితంగా ఉండాలి అంటూ నిఖిల్ వేధించడం మొదలుపెట్టాడు. తన కాపురం చక్కగా సాగుతోందని, ఇకపై తన జోలికి రావద్దని ఆ యువతి ఎంత ప్రాధేయపడినా అతను వినలేదు. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకున్న నిఖిల్, ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను నేరుగా ఆమె భర్త వాట్సాప్‌కు పంపించాడు.
భార్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురైన భర్త, ఆ మానసిక వేదనను తట్టుకోలేకపోయాడు. దంపతుల మధ్య తీవ్ర వివాదాలు చెలరేగి, చివరికి ఆమెను వదిలేశాడు. నిఖిల్ చేసిన పని వల్ల ఒక నిండు ఆడపిల్ల జీవితం రోడ్డున పడింది. కాపురం కూలిపోయినా నిఖిల్లో మార్పు రాలేదు. గత నెల రోజులుగా ఇప్పుడు ఎలాగూ భర్త వదిలేశాడు కదా, నన్ను కలవాల్సిందే అంటూ మరింత దారుణంగా వేధించడం ప్రారంభించాడు.
{{/usCountry}}భార్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురైన భర్త, ఆ మానసిక వేదనను తట్టుకోలేకపోయాడు. దంపతుల మధ్య తీవ్ర వివాదాలు చెలరేగి, చివరికి ఆమెను వదిలేశాడు. నిఖిల్ చేసిన పని వల్ల ఒక నిండు ఆడపిల్ల జీవితం రోడ్డున పడింది. కాపురం కూలిపోయినా నిఖిల్లో మార్పు రాలేదు. గత నెల రోజులుగా ఇప్పుడు ఎలాగూ భర్త వదిలేశాడు కదా, నన్ను కలవాల్సిందే అంటూ మరింత దారుణంగా వేధించడం ప్రారంభించాడు.
{{/usCountry}}ఇక నిఖిల్ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు.. తీవ్ర మనోవేదనకు గురై తన కుటుంబ సభ్యులకు, బంధువులకు అసలు విషయం చెప్పి కన్నీరుమున్నీరైంది. నిందితుడికి తగిన శాస్తి చేయాలని భావించిన బంధువులు ఒక పథకం పన్నారు.
ఆదివారం రాత్రి బాధితురాలితో నిఖిల్‌కు ఫోన్ చేయించి, విజయవాడ పీవీపీ మాల్ వద్దకు రావాలని చెప్పారు. ఆమె మాటలు నమ్మి విజయవాడకు చేరుకున్న నిఖిల్ మాల్ సమీపంలో నిలబడి ఉండగా.. ముందే కాపుకాసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, అతడు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆగ్రహంతో చితకబాదారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.