ఏపీకి IMD బిగ్ అలర్ట్ - అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు..! వాయుగుండంగా మారే అవకాశం
Andhra Pradesh Heavy Rains Alert : ఉత్తర అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారి…. బుధవారానికి ఒడిశా-ఉత్తరాంధ్ర తీరానికి చేరుకోనుంది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Andhra Pradesh Heavy Rains Alert : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో క్రమంగా తీవ్రరూపం దాల్చి రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ అల్పపీడనం రోజురోజుకు బలపడుతూ…. సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాతి రోజే, అంటే మంగళవారం నాటికి ఇది మరింత తీవ్రమై 'తీవ్రవాయుగుండం'గా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తీవ్రవాయుగుండం బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేసింది.
భారీ వర్ష సూచన….
ఈ అల్పపీడనం మరియు తీవ్రవాయుగుండం ప్రభావంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా ధారాపాతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు భారీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం(నేటి) నుంచే రాష్ట్రమంతటా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి, అనేక చోట్ల విస్తారంగా వర్షాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పుల నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. సముద్రం తీవ్ర అలజడిగా మారనున్నందున…. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని ఖచ్చితమైన ఆంక్షలు విధించింది. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన వేటగాళ్లు తక్షణమే సమీప తీరాలకు తిరిగిరావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

