...
...
Next Story

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం - ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఎల్లుండి నాటికి ఇది తీవ్ర తుపానుగా మారి ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Published on: Nov 15, 2026, 09:58:43 IST
Advertisement

బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. అక్కడ ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఈ వాయుగుండం అండమాన్ దీవులకు 700 కిలోమీటర్లు, చెన్నైకి 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1040 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తీవ్ర తుపానుగా మారే సూచనలు….

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం….. ఈ వాయుగుండం రేపు (సోమవారం) తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత ఎల్లుండి (మంగళవారం) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి 'తీవ్ర తుపాను'గా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. దీని కారణంగా గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. "తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి" అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. పొలాల్లో కోతకు వచ్చిన పంటలు తడిసిపోకుండా రైతులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks