నవంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణ వాతావరణ అంచనాలు ఇలా

ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 

Published on: Nov 11, 2026, 10:19:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొద్దిరోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం….. బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది.

ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్స్
ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్స్

ప్రస్తుతం వాయవ్య ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో పాటు నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి, తదుపరి 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశముంది.

ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్…

కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. రాయలసీమలో కూడా రాబోయే కొన్ని రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ….. నవంబర్ 14వ తేదీన రాయలసీమ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 11 నుంచి 16 వరకు రాబోయే ఆరు రోజుల పాటు ప్రధానంగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి తీవ్ర హెచ్చరికలు లేవు.

ఇక హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఆవరించే అవకాశముంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32°C, కనిష్ట ఉష్ణోగ్రత 16°C గా నమోదయ్యే సూచనలున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయి.

తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచే చలి పంజా విసురుతోంది. అత్యల్పంగా నిర్మల్​ జిల్లాలో 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జయశంకర్​ భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్​ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రమంతటా చలిగాలులు వీచే సూచనలున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More