TTD LPG Crisis : తిరుమలలోనూ ఎల్పీజీ తిప్పలు తప్పడం లేదా? రోజుకు ఎంత గ్యాస్ అవసరం?

TTD LPG Crisis : దేశవ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభంపై ఆందోళన నెలకొన్నది. అయితే తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో సైతం గ్యాస్ సంక్షోభం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

Published on: Mar 12, 2026, 15:41:56 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజూ వేల మంది కడుపు నింపుకొంటారు. మరోవైపు లడ్డూలు కూడా వేల సంఖ్యలో అమ్ముడవుతాయి. వీటన్నింటికీ ఎల్పీజీ అవసరం. అయితే ఇప్పుడు దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం తిరుమలపై కూడా పడిందా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.

తిరుమలలో గ్యాస్ సంక్షోభం ఉందా?
తిరుమలలో గ్యాస్ సంక్షోభం ఉందా?

తిరుమలలో లడ్డూ, అన్నదానం వంటశాలలకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని టీటీడీ తెలిపింది. తిరుమలలో ప్రతిరోజూ సగటున నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారని, పండుగ సమయాల్లో ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు పెరుగుతుందని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.

తిరుమలలో లడ్డూ తయారీకి, అన్నదానం యూనిట్లకు కలిపి మొత్తం వంట గ్యాస్ అవసరం రోజుకు 10 టన్నులకు పైగా ఉందని ఓ అధికారి వెల్లడించారు. తిరుమలలో వంట గ్యాస్ సరఫరాకు కొరత లేదా అంతరాయం లేదు. భక్తులు ఎలాంటి పరిమితులు లేకుండా యథావిధిగా లడ్డూలను తీసుకోవచ్చు అని అధికారి పీటీఐకి తెలిపారు. లడ్డూలు, స్వీట్లు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా తయారు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వారానికి సరిపడా వంట గ్యాస్ బఫర్ స్టాక్‌ను నిర్వహిస్తుందని అధికారి పేర్కొన్నారు.

లడ్డూ పంపిణీలో ప్రాధాన్యత మొదట తిరుమలకు ఇస్తాు. తరువాత టీటీడీ సమాచార కేంద్రాలు, ముఖ్యమైన దేవాలయాలకు సరఫరా చేస్తారు. అదేవిధంగా టీటీడీ లడ్డూ తయారీకి, ప్రధాన అన్నదానం కేంద్రానికి పైపుల ద్వారా గ్యాస్ సరఫరాను ఉపయోగిస్తుంది. అయితే ఇతర అన్నదానం యూనిట్లకు సిలిండర్లను ఉపయోగిస్తారు.

ప్రధాన అన్నదానం కేంద్రంలో సగటున దాదాపు 75,000 భోజనాలు తయారు చేస్తుండగా.. అన్ని కేంద్రాలలో దాదాపు 2.25 లక్షల భోజనాలు వడ్డిస్తారు. పండుగ రోజుల్లో అన్నదాన కేంద్రాలలో తయారుచేసే భోజనాల సంఖ్య మూడు లక్షలకు పైగా పెరుగుతుందని అధికారి తెలిపారు. సో.. టీటీడీలో ప్రస్తుతానికి ఎలాంటి గ్యాస్ సంక్షోభం లేదు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More