...
...
Next Story

శ్రీశైలం ఆలయానికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు.. ఎల్పీజీ కొరత రాకుండా అధికారుల ప్లాన్

LPG Crisis : తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సంక్షోభం నెలకొన్నది. ఈ ఎఫెక్ట్ దేవస్థానాలపైనా ఉంది. దీంతో ఉగాది వస్తుండటంతో అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు.

Published on: Mar 14, 2026, 15:37:01 IST
Advertisement

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపైనా పడుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లలో కూడా ప్రభావం పడింది. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల కొరత కూడా సృష్టిస్తున్నారు.

శ్రీశైలం ఆలయానికి గృహ వినియోగ సిలిండర్లు
శ్రీశైలం ఆలయానికి గృహ వినియోగ సిలిండర్లు

రాష్ట్రంలోని ఆలయాల మీద కూడా ఎల్పీజీ సంక్షోభం ప్రభావం ఉంది. శ్రీశైలం దేవస్థానం భక్తులకు అన్నప్రసాదం నిరంతరాయంగా తయారు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను తాత్కాలికంగా ఉపయోగించడానికి ఆలయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందారు. ఉగాది మహోత్సవాల సమయంలో అన్నప్రసాదాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, ముఖ్యంగా కర్ణాటక నుండి వచ్చే యాత్రికులు ఉగాది వేడుకల కోసం శ్రీశైలాన్ని సందర్శిస్తారు. సాధారణ రోజుల్లో ఆలయం 4,000 నుండి 6,000 మంది భక్తులకు ఆహారం తయారు చేయడానికి ప్రతిరోజూ 20 నుండి 25 వాణిజ్య సిలిండర్లను ఉపయోగిస్తుంది.

అయితే పండుగ సమయంలో అన్నప్రసాదంలో పాల్గొనే భక్తుల సంఖ్య రోజుకు 50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయ గోడౌన్లలో ఇప్పటికే 500కి పైగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉన్నాయని, త్వరలో మరో లారీ లోడ్ వస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడుతోంది. వాణిజ్య సిలిండర్, గృహ వినియోగ సిలిండర్‌పై భారీగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు గృహ వినియోగ సిలింటడర్లకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఈ 14 కిలోల గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు నానా తిప్పలు పడుతున్నారు. ఏజెన్సీల వద్దకు పరుగుల తీస్తు్న్నారు.

చాలా గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి. దీని ద్వారా డబ్బులు అధికంగా దండుకుంటున్నాయి. కృత్రిమంగా గ్యాస్ కొరతను సృష్టిస్తున్నాయి. ఓ వైపు గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. బుకింగ్ చేసుకున్నా.. సరఫరాలో జాప్యం జరుగుతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks