ఏపీ LRSకు ఇవాళే చివరి తేదీ - గడువు పొడిగింపుపై ప్రతిపాదనలు..!
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపుపై ఏపీ సర్కార్ మరోసారి ఆలోచన చేస్తోంది. ఇదే విషయంపై అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో… మరోసారి పొడిగించే అవకాశం ఉందని సమాచారం.
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ గడువు పలుమార్లు పొడిగించారు. అయితే పొడించిన సమయం కూడా ఇవాళ్టితో(జనవరి 23) పూర్తి కానుంది.

నేటితో గడువు ముగింపు…
నేటితో ఎల్ఆర్ఎస్ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి మరోసారి పొడిగింపు ప్రతిపాదన చేరింది. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో 3 నెలలు గడువు పొడిగించాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.
పొడిగించే ఛాన్స్…
పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి గడువు పెంపునకు విజ్ఞప్తులు వస్తున్నాయని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో…. ఏపీ సర్కార్ మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 53 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. గడువు పొడిగిస్తే మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఇవాళ్టి వరకు ఫీజులు చెల్లిస్తే డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీ కింద ప్లాట్ మొత్తం విలువలో 14శాతానికి బదులు7 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అయితే సంబంధిత ఛార్జీలను ఈనెల 23వ తేదీలోపు చెల్లించే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ నిర్ణయం వర్తిస్తుంది.
ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులకు కేటాయించిన భూములు, గ్రీన్ బఫర్ జోన్లు, తీరప్రాంత నియంత్రణ మండలి పరిధిలో ప్లాట్లు, లేఔట్లలో ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. నిబంధనలకు లోబడి ఉన్న ఫ్లాట్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. https://dtcp.ap.gov.in/LRS/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

