తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా పులుల సంచారం భయంపుట్టిస్తోంది. అటవీ అధికారులు వాటిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన మగ పులి గోదావరి ప్రాంత వాతావరణానికి అలవాటుపడినట్లు కనిపిస్తోంది.

జాతీయ పులి సంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 6న తూర్పు గోదావరి జిల్లాలోని కుర్మాపురం గ్రామంలో మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. ఈ పులిని ఫిబ్రవరి రెండో వారంలో పాపికొండ నేషనల్ పార్కు వైపు విడుదల చేశారు. అయితే వాగులు, వంకలు దాటుతూ.. ఆహారం కోసం వెతుకుతూ.. ఈ పులి గోదావరి నదిని దాటి మళ్లీ తూర్పు గోదావరి జిల్లాకు తిరిగి వచ్చింది. అయితే డిసెంబర్ 2025లో మహారాష్ట్రలోని తన స్వస్థలమైన తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌ను విడిచిపెట్టినప్పటి నుంచి ఇది ఏ మనిషిపైనా దాడి చేయలేదు.
ఫిబ్రవరి 14 నుంచి ఈ పులి గోదావరి నదిని దాటి రెండుసార్లు తూర్పు గోదావరి జిల్లాకు తిరిగి వచ్చింది. పులి ఏ ఒక్క నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా జలాశయాల వెంట తిరుగుతోంది. దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకోవడం కష్టంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా కొరుకొండ మండలం, మునగాల గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ 22 రాత్రి నుంచి ఇది సంచరిస్తోంది.
మునగాల వద్ద తెల్లవారుజామున 3 గంటల తరువాత ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు కదలికలను గుర్తించారు. కాపవరం పాండవుల మెట్ట నుంచి గురువారం రాత్రి కిందికి దిగిన పులి స్థానిక బ్రహ్మలింగం చెరువులో ఉన్నది. ఆ తర్వాత అక్కడి నుంచి మునగాల కొండ పైకి చేరుకున్నది. గత 48 గంటల్లో పులి వల్ల పశువులు చనిపోయినట్లు ఎలాంటి సమాచారం లేదు.
రాజమహేంద్రవరం అటవీ రేంజ్ అధికారి దావీదురాజు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్, ప్రత్యేక బృందాలు మునగాల కొండ వద్ద గస్తీలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొన్ని బృందాలను రప్పించారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా పులి రోజంతా జలాశయాల్లోనే గడుపుతోంది. సంరక్షణ నిబంధనల ప్రకారం జలాశయంలో ఉన్న జంతువుకు మత్తుమందు ఇచ్చి లొంగదీసుకోవడానికి వీలు లేదు. రాత్రిపూట సంచారం ఎక్కువగా చేస్తోంది.
{{/usCountry}}రాజమహేంద్రవరం అటవీ రేంజ్ అధికారి దావీదురాజు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్, ప్రత్యేక బృందాలు మునగాల కొండ వద్ద గస్తీలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొన్ని బృందాలను రప్పించారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా పులి రోజంతా జలాశయాల్లోనే గడుపుతోంది. సంరక్షణ నిబంధనల ప్రకారం జలాశయంలో ఉన్న జంతువుకు మత్తుమందు ఇచ్చి లొంగదీసుకోవడానికి వీలు లేదు. రాత్రిపూట సంచారం ఎక్కువగా చేస్తోంది.
{{/usCountry}}ఏప్రిల్ 6 నాటికి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో 53 రోజుల పాటు ప్రయాణించింది ఈ పులి. 650 కిలోమీటర్లకు పైగా నడిచింది.