సిద్దిపేట జిల్లాలోని గ్రామాల్లో పులి పగ్ గుర్తులు.. భయాందోళనలో ప్రజలు

సిద్దిపేట జిల్లాలో తాజాగా పులి పగ్ గుర్తులు మరోసారి కనిపించారు. దీంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు.

Published on: Feb 15, 2026 6:15 PM IST
By , Siddipet
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 15 ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని గ్రామాల్లో పులి పగ్ గుర్తులు కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం విఠలాపూర్ గ్రామ శివార్లలో ఒక స్థానిక రైతు ఆ పగ్ గుర్తులను చూసి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ పగ్ గుర్తులు అడవికి దాదాపు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైతులు రాత్రిపూట బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

సిద్దిపేట జిల్లాలో పులి పగ్ గుర్తులు
సిద్దిపేట జిల్లాలో పులి పగ్ గుర్తులు

గత వారం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో ఐదు పశువులను చంపింది పులి. అంతకు ముందు జనగాం ప్రాంతంలో రెండు గొర్రెలను చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ గత రెండు నెలలుగా ప్రయత్నిస్తోంది.

రెండు నెలలకు పైగా ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలకు, అలాగే తెలంగాణ అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఆ పులి. అయితే ఇది మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ నుంచి వచ్చిందని అందరూ మెుదట భావించారు. కానీ ఈ పులి తిపేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చింది కాదు.

మహారాష్ట్ర అటవీ అధికారులు పెద్దపులి తిప్పేశ్వర్ నుండి వచ్చినది కాదని నిర్ధారించారు. పులి చిత్రాన్ని.. తమ దగ్గర ఉన్న డేటాబేస్‌తో సరిపోల్చారు. ఇది ఇక్కడి నుండి వెళ్లిందని కాదని.. అని తిప్పేశ్వర్ అభయారణ్యం పరిధిలోకి వచ్చే మెల్‌ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ ఆదర్శ్ అన్నారు.

తడోబా-అంధారి టైగర్ రిజర్వ్, దాని పరిసరాల నుండి వచ్చిన పెద్ద పులితో ఇది సరిపోతుందో లేదో చూడటానికి దీని చిత్రాన్ని చంద్రపూర్ అటవీ అధికారులకు పంపారు. చంద్రపూర్ జిల్లాలో పులుల అభయారణ్యం వెలుపల, గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో 150 కి పైగా పులులు సంచరిస్తున్నాయి.

తెలంగాణ అటవీ అధికారులు మొదట్లో ఆ పులి తిపేశ్వర్ అభయారణ్యం నుండి కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు దాటిందిగా భావించారు. తరువాత ఈ మగ పులి ఐదు సంవత్సరాల వయస్సు గలది అని నిర్ధారించారు. రెండు నెలల క్రితం కవ్వాల్ నుండి మంచిర్యాలకు చేరుకుందని, అప్పటి నుండి ఉత్తర తెలంగాణలో సంచరిస్తూనే ఉందని చెబుతున్నారు.

ఇప్పటివరకు మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి-భువనగిరి, జనగాం, ఇతర జిల్లాల్లో దాని కదలికలు కనిపించాయి. ఇది పశువులను మాత్రమే చంపి తిన్నట్టుగా గుర్తించారు. పంట పొలాలకు వెళ్లే రైతులలో భయాందోళనలను సృష్టిస్తోంది ఈ పులి. అధికారిక సమాచారం ప్రకారం, ఇది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని అటవీయేతర ప్రాంతాలలో సంచరిస్తోంది. సిద్దిపేట జిల్లా కోహెడ సమీపంలోని సింగరాయగుట్ట సమీపంలో పులిని నైట్ విజన్ కెమెరా ట్రాప్‌లు గుర్తించాయి. దీనితో సమీప ప్రాంతాలలో హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More