ఇటీవల సంచలనం సృష్టించిన ఏలూరు అత్యాచారం కేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సస్పెక్ట్ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్‌తో పాటు వారికి సహాయం చేసిన ఆకేటి ధనుష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులను టూ-టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు వీధుల గుండా జనాలు చూస్తుండగా నడిపిస్తూ తీసుకెళ్లారు. విచారణ తర్వాత న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ఆ తర్వాత వారిని జిల్లా జైలుకు తరలించారు.

నేరస్థులలో భయాన్ని కలిగించడం, తీవ్రమైన నేరాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిరూపించేందుకు ఇలా నడిపించికుంటూ తీసుకెళ్లామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, నిందితులు చట్టం ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని అన్నారు. నేరస్థుల్లో భయం పుట్టించేందుకు ఇలా బహిరంగంగా నడిపిస్తూ తీసుకెళ్లామన్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా కేంద్రంలో యువతిపై అత్యాచారం జరిగింది. విజయవాడ నిడమానూరు ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన ఏలూరుకు చెందిన మరో యువతితో ఫ్రెండ్‌షిప్ కుదిరింది. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లి వచ్చారు. మరికొన్ని రోజుల తర్వాత అంటే నవంబర్ 28వ తేదీన విజయవాడ యువతి ఏలూరుకి చెందిన యువతి ఇంటికి వచ్చింది.
అయితే డిసెంబర్ 2వ తేదీన ఏలూరులోనే ఇద్దరు యువతులు ఉన్నారు. ఏలూరు అమ్మాయి తల్లి.. ద్వారకతిరుమల వెళ్లడంతో యువతులే ఇంట్లో ఉన్నారు. అదే రాత్రి సమయంలో పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవానీ కుమార్ మద్యం సేవించి.. ఆ ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. అమ్మాయిలు ఇద్దరు భయపడి తలుపులు తీయలేదు. కాసేపటికి రాళ్లు విసరడంతో తలుపులు తీశారు. ఇంట్లోకి వచ్చిన జగదీశ్.. విజయవాడకు చెందిన యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏలూరు యువతిని భవానీ కుమార్ అడ్డుకున్నాడు.
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఇద్దరు యువతలు సైలెంట్ అయిపోయారు. మళ్లీ కాసేపటి తర్వాత వచ్చి.. అత్యాచార బాధితురాలిని దారుణంగా కొట్టారు. భయపడిపోయిన బాధితురాలు సమీపంలోని ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
{{/usCountry}}ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఇద్దరు యువతలు సైలెంట్ అయిపోయారు. మళ్లీ కాసేపటి తర్వాత వచ్చి.. అత్యాచార బాధితురాలిని దారుణంగా కొట్టారు. భయపడిపోయిన బాధితురాలు సమీపంలోని ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
{{/usCountry}}బాధితురాలని వెంటనే చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులతోపాటుగా ఆ రోజు ఘటన స్థలంలో ఉన్న ధనుష్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. తాజాగా వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు.