...
...
Next Story

వారికి మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ నెల 15న మీటింగ్

రైతుల కష్టాలపై వ్యాపారం చేయొద్దని ఫీడ్ కంపెనీలకు మంత్రి అచ్చెన్నాయుడు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏకపక్ష ధరల పెంపు అంగీకరించం అని స్పష్టం చేశారు.

Updated on: May 13, 2026, 15:50:16 IST
Advertisement

ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆక్వా రైతులకు ఊరట
ఆక్వా రైతులకు ఊరట

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందిస్తూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

మంత్రి ఆదేశాల నేపథ్యంలో ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పందిస్తూ, పెంచిన ఫీడ్ ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్న కారణంగా ఫీడ్ ధరల సవరణపై ఆలోచించాల్సి వచ్చిందని అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు, మార్గదర్శకాలను గౌరవిస్తూ ధరల పెంపును వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులు పాల్గొనే ఉమ్మడి సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అందరి అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని రైతులకు నష్టం కలగకుండా, పరిశ్రమ కూడా కొనసాగగలిగే విధంగా పరస్పర ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఏపీఎస్ఎడియే కో-వైస్ చైర్మన్, పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్‌తో పాటు ఎస్ఐఎఫ్టి, సీఐబీఏ, సీఐఎఫ్ఏ, సీఐఎఫ్టీ, మత్స్య విశ్వవిద్యాలయం ప్రతినిధులు, రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe