సంక్రాంతి కోడిపందేలు.. రూ.1.53 కోట్ల గెలుచుకున్న రాజమండ్రి రమేశ్‌ డేగ!

ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కోడిపందేల వద్ద జనాలు పెద్ద ఎత్తున వచ్చి చేరారు. కోట్ల రూపాయల్లో పందేలు జరిగినట్టుగా తెలుస్తోంది.

Published on: Jan 15, 2026, 19:41:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిషేధం, పదే పదే హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించారు. నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల్లో పందెం వేయడంతో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు చేతులు మారాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. కోడి పందేలు, జూదం కార్యకలాపాలను నిర్వహించవద్దని హెచ్చరికలు ఉన్నా.. ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ప్రముఖులు సైతం హాజరై సంబరాలు చేసుకున్నారు.

తెలంగాణతోపాటుగా ఇతర రాష్ట్రాల జనాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. కోడి పందేల బరుల వద్ద ఉత్సహంగా కనిపించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా కోడి పందేలు వీక్షించారు. రాత్రంతా కోడి పందేలు నిర్వహించడానికి నిర్వాహకులు జనరేటర్లు, ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు కూడా ఉన్నాయి.

ఇక కోడి పందేల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు తాడేపల్లిగూడెంలో జరిగిన పందేమే ఉదాహరణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపందేలు భారీగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా సమాచారం. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో హైలెట్ అయ్యాయి.

ఎందుకంటే ఇక్కడ ఏకంగా రూ.1.53 కోట్ల భారీ పందెం జరిగింది. ఈ పందెం గుడివాడ ప్రభాకర్ సేతువ, రాజమండ్రికి చెందిన రమేశ్ డేగ మధ్య జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో రాజమండ్రి రమేశ్ డేగ విజయ సాధించింది. రమేశ్ రూ.1.53 కోట్లు గెలుచుకున్నాడు. ఈ పందెం వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. తాడేపల్లిగూడెం మాత్రమే కాదు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి ప్రాంతాల నుంచి కూడా కోళ్ల పందేలు చూసేందుకు వచ్చారు.

కోడిపందేలు అనగానే.. కేవలం పోటీ మాత్రమే అనుకోవద్దు. దీనికోసం చాలా కసరత్తు ఉంటుంది. కోళ్లను చాలా జాగ్రత్తగా సిద్ధం చేయడమే కాదు.. ఖగోళశాస్త్రం, జ్యోతిష్యం లెక్కలు కూడా చూసుకుంటారు పందెంరాయుళ్లు. నక్షత్రంవంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా జరిగాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More