ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు క్యూట్ విలేజ్ డ్రామా- 3 రూపాయల కోసం పిల్లాడి పాట్లు- మనసుకు హత్తుకునే సీన్స్- ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ తెలుగు క్యూట్ విలేజ్ డ్రామా సినిమా తొవ్వ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కేవలం మూడు రూపాయల కోసం 12 ఏళ్ల పిల్లాడు డే పాట్లతో ఈ సినిమా సాగుతుంది. మనసుకు హత్తుకునే సీన్లతో తెరకెక్కిన సినిమా తొవ్వ. మరి తొవ్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్కడ ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 4, 2026, 12:45:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్వచ్ఛమైన తెలుగులో వచ్చే ఓటీటీ కంటెంట్ చాలా అరుదు. ఇతర భాషల నుంచి డబ్బింగ్ ద్వారా ఎన్నో ఓటీటీ మూవీస్ వస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని పల్లె కథలతో అరకొరగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి వారం అచ్చమైన తెలుగు కథలుగా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు క్యూట్ విలేజ్ డ్రామా- 3 రూపాయల కోసం పిల్లాడి పాట్లు- మనసుకు హత్తుకునే సీన్స్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు క్యూట్ విలేజ్ డ్రామా- 3 రూపాయల కోసం పిల్లాడి పాట్లు- మనసుకు హత్తుకునే సీన్స్- ఎక్కడంటే?

3 రూపాయల కోసం

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఆ మూవీనే తొవ్వ. తెలుగు క్యూట్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. కేవలం మూడు రూపాయల డబ్బు కోసం 12 ఏళ్ల పిల్లాడు పడే పాట్లు ఏంటనే కథాంశంగా తొవ్వ తెరకెక్కింది.

ఎలాంటి దారుల్లో సంపాదించాలి

తొవ్వ అంటే తెలంగాణ మాండలికంలో దారి అనే అర్థం వస్తుంది. అంటే డబ్బును ఎలాంటి దారుల్లో సంపాదించాలనే పాయింట్‌ను ఇన్‌డైరెక్ట్‌గా చెబుతు మనసుకు హత్తుకునే సీన్లతో తొవ్వను తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్ పంచిక.

న్యూస్ పేపర్స్ దొంగతనం

12 ఏళ్ల పిల్లాడు అమ్మ, నాన్న, తాతను మూడు రూపాయలు అడుగుతాడు. ఎవరు ఇవ్వరు. 3 రూపాయల కోసం న్యూస్ పేపర్స్ దొంగతనం చేసి అమ్మాలని చూడటం, జామ పండ్లు అమ్మడం వంటి నానా రకాల పనులు చేస్తాడు. నెల రోజులు కష్టపడితే వచ్చే డబ్బు విలువ గురించి కొడుకు తండ్రి చెప్పడం వంటి సీన్స్ హృద్యంగా ఆకట్టుకుంటాయి.

ఓటీటీలోకి తొవ్వ

అసలు ఆ పిల్లాడికి 3 రూపాయలు ఎందుకు కావాలనే అంశం 90స్ కిడ్స్‌కు మంచి అనుభూతిని కలిగిస్తుంది. డబ్బు కోసం మనం తొక్కే దారులు ఎలాంటివి అనేది లోతైన అర్థంతో ఓ పిల్లాడి చుట్టు అల్లిన ఓ ఫీల్ గుడ్ క్యూట్ స్టోరీనే తొవ్వ. ఇలాంటి తొవ్వ ఓటీటీలోకి వచ్చేసింది.

ఈటీవీ విన్ కథా సుధా

ఇవాళ (జనవరి 4) ఈటీవీ విన్‌లో తొవ్వ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పటిలా ప్రతివారం లాగే ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్‌లో భాగంగా తొవ్వ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ వీక్లీ ఓటీటీ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తొవ్వ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

తొవ్వ నటీనటులు

ఇకపోతే తొవ్వ సినిమాలో లిటిల్ ఐకాన్, చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్ మెయిన్ రోల్ చేశాడు. పూర్ణచంద్ర, మోనిక బూసమ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. క్యూట్ ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునేవారు నేటి నుంచి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తొవ్వపై లుక్కేయడం బెటర్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More