...
...
Next Story

అల్లూరి జిల్లాకు రెడ్ అలెర్ట్ : పిడుగులతో కూడిన వర్షాలు - వాతావరణశాఖ

AP Weather Updates : అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Published on: Apr 25, 2026, 16:44:59 IST
Advertisement

AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల వ్యవధిలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయని తెలిపింది. పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అల్లూరి జిల్లాకు రెడ్ అలెర్ట్
అల్లూరి జిల్లాకు రెడ్ అలెర్ట్

వర్షంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. గాలుల ధాటికి బలహీనంగా ఉన్న నిర్మాణాలు, చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమని సూచించారు.

పిడుగుల ముప్పు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని కోరారు:
  • వర్షం పడే సమయంలో పొలాల్లో పనులు చేసే రైతులు, పశువుల కాపరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
  • పిడుగుల ముప్పు ఉన్నప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందడం చాలా ప్రమాదం. పక్కా భవనాల్లోకి వెళ్లడం సురక్షితం.
  • ఇంట్లో ఉన్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకపోవడం, ప్లగ్ పాయింట్ల నుంచి డిస్కనెక్ట్ చేయడం మంచిది.
  • ఈదురు గాలుల వల్ల రోడ్లపై దృశ్యమానత తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

మన్యంలో ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని…. ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks