AP Weather : రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి ఇలా

AP Weather : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజులు వాతావరణ పరిస్థితి భిన్నంగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.

Published on: Apr 22, 2026, 12:54:46 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ఉండనుంది. రాబోయే నాలుగు రోజుల పాటు పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలో తీవ్రమైన వేడి, వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొంది.

ఏపీ వెదర్ అప్డేట్
ఏపీ వెదర్ అప్డేట్

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 76 మండలాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు, మరో 134 మండలాల్లో వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

గురువారం 51 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. వీటితోపాటుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. మెుత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 25వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది.

మే నెలలో రాయలసీమ

ఇక మే నెలలో రాయలసీమ ప్రాంతమంతటా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. మే నెలలో ఇవి మరో రెండు డిగ్రీలు పెరిగి 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. నగరాలు, పట్టణాల నడిబొడ్డున ఉన్న బీటీ రోడ్ల వెంబడి ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలపైన వరకు కూడా చేరవచ్చు. రాయలసీమలో తరచుగా వేడి, పొడి పరిస్థితులకు దారితీస్తుందని వాతావరణ అధికారులు వివరించారు. సాధారణ సంవత్సరాలతో పోలిస్తే, రాబోయే రోజుల్లో ఈ సీజన్‌లో సగటు కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.

ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది తీవ్రమైన వేసవి పరిస్థితులు ముందుగానే ప్రారంభమవుతున్నాయని సూచిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు కొనసాగే వడగాలుల ప్రభావం వ్యవసాయంపై, ముఖ్యంగా అధిక వేడిని తట్టుకోలేని పంటలపై పడొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More