...
...
Next Story

ఇవాళ అమరావతికి బిల్ గేట్స్ - పలు అంశాలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్

గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సంజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Published on: Feb 16, 2026, 06:58:12 IST
Advertisement

గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం(ఇవాళ) రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది.

ఏపీకి బిల్ గేట్స్ రాక
ఏపీకి బిల్ గేట్స్ రాక

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ బృందం కొద్దిసేపు సమావేశం కానుంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు.

ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా గేట్స్ పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం కానున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్….

రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.

అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks