విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయం.. రెండున్నర లక్షలకుపైగా మెజారిటీ

విశాఖలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు. 2 లక్షలకుపైగా ఆధిక్యంతో కూటమి రికార్డు నెలకొల్పింది.

Published on: Nov 3, 2026, 22:22:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(GVMC) ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన మేయర్ స్థాన పోరులో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుదు కల్యాణిపై ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు.

విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి గెలుపు
విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి గెలుపు

మొత్తం 120 డివిజన్లు ఉన్న విశాఖ మహానగరంలో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కార్పొరేషన్‌పై పసుపు జెండాను ఎగరవేశారు. విశాఖపట్నం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజేత ముక్కా శ్రావణి మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

'విశాఖపట్నం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది. ప్రజలు మాపై నమ్మకంతో రెండున్నర లక్షల భారీ మెజార్టీని అందించారు. ఈ చారిత్రాత్మక విజయం సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా నగర అభివృద్ధి పట్ల మాపై బాధ్యతను మరింత పెంచింది.' అని ఆమె పేర్కొన్నారు.

నగర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనతో విశాఖపట్నాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నుంచి వరుదు కల్యాణి బరిలోకి దిగినప్పటికీ, టీడీపీ కూటమి వ్యూహం ముందు నిలవలేకపోయారు.

120 డివిజన్ల పరిధిలో మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి దక్కించుకోవడం ద్వారా జీవీఎంసీ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయి వరకు కూటమి అభ్యర్థుల విజయం విశాఖ ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా చాటిచెప్పింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో ముక్కా శ్రావణి విజయం సాధించడంతో నగరవ్యాప్తంగా టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు.

గుంటూరులో మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ గెలుపు

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. గుంటూరు నగర మేయర్ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తన సమీప ప్రత్యర్థిపై 40 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 76 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి మెజారిటీ డివిజన్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయాలను నమోదు చేసుకున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More