AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. నవంబర్ 26న పోలింగ్
AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు వివాదాలు క్లియర్ కావడంతో పలు పురపాలక, నగరపాలక సంస్థలకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకొని వాయిదా పడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ తుది దశకు చేరింది. కోర్టు వివాదాలు తొలగిపోవడంతో మిగిలిపోయిన పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమగ్ర పోలింగ్ ప్రణాళికను ఎస్‌ఈసీ అధికారికంగా ఖరారు చేసింది.

రాష్ట్రంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన మొదటి దశ పంచాయతీ ఎన్నికలతో పాటుగానే, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 12వ తేదీన అధికారిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి చేసి, నవంబర్ 26వ తేదీన ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల నిర్వహణ అధికారుల నియామకం, ఓటర్ల జాబితా తనిఖీ, రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లీగల్ క్లియరెన్స్ రావడంతో 4 ప్రముఖ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల వేడి మెుదలైంది. అవి శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం (రాజమండ్రి), మంగళగిరి - తాడేపల్లి.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిలిచిపోయిన 19 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎస్‌ఈసీ పచ్చజెండా ఊపింది. ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నర్సరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోటలో ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 13 నగరపాలక సంస్థలు, 92 పురపాలక సంఘాల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు భారీ విజయాన్ని సాధించి తమ ఆధిక్యాన్ని చాటుకున్నాయి. అయితే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
ఇటీవల న్యాయస్థానాల్లో ఈ వివాదాలను పరిష్కరించడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు పూర్తి చేస్తోంది. దీనితో ఆయా పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్రంలో 13,171 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ రెడీ అయింది. వాటితోపాటుగానే.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. గ్రామపంచాయతీలకు ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. తొలి దశ పోలింగ్ 26 నవంబర్, రెండో దశ పోలింగ్ 29, మూడో దశ పోలింగ్ 2 డిసెంబర్‌న జరుగుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


