నాబార్డు క్రెడిట్ ప్లాన్‌.. 2026-27కు రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక

నాబార్డు క్రెడిట్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అంచనగా ఉంది.

Published on: May 5, 2026, 20:47:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది రూ.4.24 లక్షల కోట్లు ఉండగా... ఈ ఏడాది 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లతో ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది.

నాబార్డు క్రెడిట్ ప్లాన్‌
నాబార్డు క్రెడిట్ ప్లాన్‌

సాగుకు మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో పంట రుణాలు రూ.1.66 లక్షల కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.8,265 కోట్లు, ఫిషరీస్‌కు రూ.21,098 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.11,961 కోట్లు కేటాయించింది.

హార్టికల్చర్‌లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు రూ.5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు రూ.12,687 కోట్లతో ప్రణాళిక సిద్దం చేసింది. అలాగే ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు చొప్పున కేటాయించింది.

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. హార్టికల్చర్‌ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డ్ ప్రతినిధులను సీఎం కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్‌లో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

ఏడాదికి 450 లక్షల మెట్రికల్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తులు రాష్ట్రం సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డ్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఎం.ఆర్.గోపాల్, జీఎం కెవిఎస్ ప్రసాద్, కెనారా, ఎస్బీఐ, ఎస్ఎల్‌బీసీ, ఏపీజీబీ, ఏపీసీవోబీ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More