...
...
Next Story

చర్లపల్లి - నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ట్రైన్ అప్డేట్ : ఏపీ, తెలంగాణలో టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవే

ఇవాళ్టి నుంచి చర్లపల్లి - నాగర్ కోల్ మధ్య ప్రకటించిన కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు షురూ అవుతాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఈ ట్రైన్ వెళ్తుంది.ఈ ట్రైన్ కు సంబంధించిన టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Mar 11, 2026, 14:41:24 IST
Advertisement

హైదరాబాద్‌ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైన్ కు సంబంధించి రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ్టి(మార్చి 11) నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయి.ఈ ట్రైన్ కు సంబంధించిన టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.

మృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్
మృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్

చర్లపల్లి - నాగర్‌కోయిల్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్…. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఇందులో 8 స్లీపర్ క్లాస్ బోగీలు, 11 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. 1 పాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ బోగీలు (దివ్యాంగులకు అనుకూలంగా) ఉంటాయి.

టైమింగ్స్ వివరాలు:

ట్రైన్ నంబర్ 06357 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5:30 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి బయలుదేరుతుంది. గురువారం రాత్రి 11:45 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్ పట్టి, సత్తూరు, విరుధునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, పాపనాశం, కుంభకోణం, మైలాడుథురై, సర్కాజి, చిదంబరం, తిరుప్పాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, సూళ్లూరుపేట, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

  • నాగర్‌కోయిల్(తమిళనాడు) జంక్షన్ బయలుదేరే సమయం - 17:30(బుధవారం)
  • సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కు చేరే సమయం - 11:48
  • నెల్లూరు - 13:18 / 13:20
  • ఒంగోలు - 14:48 / 14:50
  • చీరాల -15:20 / 15:22
  • బాపట్ల - 15:35 / 15:37
  • తెనాలి జంక్షన్ - 16:48 / 16:50
  • గుంటూరు జంక్షన్ రా/వె 17:40 / 17:50
  • సత్తెనపల్లి - 18:59 / 19:00
  • మిర్యాలగూడ - 20:59 / 21:00
  • నల్గొండ - 21:29 / 21:30
  • చర్లపల్లికి(హైదరాబాద్) చేరుకునే సమయం 23:45. (గురువారం)

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks