ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి.. మార్కాపురంలో చంద్రబాబు కామెంట్స్
2027 గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి నుంచి నల్లమల సాగర్ అనుసంధానం ద్వారా నీళ్లు తెచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని గుర్తుచేశారు.
మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత మార్కాపురం ప్రజా వేదికలో జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మార్కాపురంలో ఆయన తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.34 వేల కోట్లు అందిస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవతో రైతులను ఆదుకుంటున్నామని, దీపం 2.0తో మహిళలకు ఉచిత సిలెండర్లు ఇస్తున్నామని పథకాల గురించి వివరించారు.
జూలై నాటికి నల్లమల సాగర్
'గోదావరి నుంచి నల్లమల సాగర్ అనుసంధానం ద్వారా నీళ్లు తెచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టు కోసం ఇంకా రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. విద్యార్థులకు ఆర్దిక సహకారం అందించాలి, రైతన్నను ఆదుకోవాలి, గిట్టుబాటు ధరలివ్వాలి ఇవన్నీ చేస్తూనే అభివృద్ధి వైపు కూడా దృష్టి పెట్టాం.' అని చంద్రబాబు అన్నారు.
మార్కాపురంలో ఉద్యానపంటలు
గత ఏడాది హంద్రినీవాపై శ్రద్ధపెట్టి నీళ్లు తీసుకెళ్లామని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది వెలిగొండపై దృష్టి పెట్టి నీళ్లు ఇస్తామని చెప్పారు. రైతుల ఆదాయం పెంచాలని చంద్రబాబు పేర్కొన్నారు. దాని కోసం పుష్కలంగా నీరిచ్చి మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యాన పంటలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
మార్కాపురం జిల్లాను ఉద్యాన వనపంటల కేంద్రంగా చేస్తామని, దానికి ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. రూ.1300 కోట్ల ఖర్చు పెట్టి నల్లమల సాగర్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కొత్త జిల్లా ఇచ్చాం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
భూ రికార్డుల సమస్యలపై ఫోకస్
మార్కాపురం జిల్లాలో భూ రికార్డుల సమస్య కూడా ఉందని, గత పాలకులు వివాదాలతో భూ కబ్జాలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు వివాదం లేకుండా ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు సర్వే చేయించి రాజముద్రతో పాస్ పుస్తకాలు, రికార్డులు జారీ చేస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్‌తో భూమి రికార్డులు అత్యంత భద్రంగా తయారు చేస్తున్నామని వెల్లడించారు. తప్పుడు రికార్డులు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
మార్కాపురం కలెక్టరేట్
'రూ.50 కోట్లతో మార్కాపురం జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచటంతో పాటు మెరుగైన పాలన ఇస్తున్నాం. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మన యువత మన దగ్గరే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర చరిత్ర మార్చాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోకుండా భూగర్భజలాలు పెంచుతున్నాం. గోదావరి నుంచి 6 వేలు, కృష్ణా నుంచి 15 వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది.' అని చంద్రబాబు అన్నారు.
జిల్లాలో ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టిద్దామని, అన్నీ సద్వినియోగం చేసుకునే పరిస్థితి రావాలన్నారు. మార్కాపురం జిల్లాను సవాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 10 లక్షల పేద కుటుంబాలను ఆదుకునేందుకు పీ4 కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు
'కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి విక్రయించారు. ఏ సంబంధం లేని హెరిటేజ్‌పై ఇప్పుడు నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ తరం బాగుండాలనే విజన్ ప్రణాళికలు చేస్తున్నాను. బీసీలకు, ఎస్సీలకు న్యాయం చేయడానికి కేటగిరైజేషన్ తీసుకువచ్చాం. లిడ్ క్యాప్ ద్వారా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
పనులు చేసిన ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత ప్రజలదేనని, మంచికి సహకరించేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవాలని ప్రజలను చంద్రబాబు కోరారు. తాను శంకుస్థాపన చేసిన వెలిగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


