ప్రకృతి వైపరిత్యంతో 2001 జనవరి 26న గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం అనేక ప్రాంతాలను ధ్వంసం చేసి శిథిలావస్థకు చేర్చిన ఎనిమిది నెలల తర్వాత, నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుండి ఒక పిలుపు వచ్చింది. ఇది ఆయన జీవిత గమనాన్ని, భారతదేశ రాజకీయ భవిష్యత్తును మార్చివేసింది. అప్పటికి 51 ఏళ్ల వయసున్న మోదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ దాదాపు 20,000 మంది ప్రాణాలను బలిగొన్న ఆ విషాద ఘటన అనంతరం సహాయక, పునరావాస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

ఎవరూ ఊహించని విధంగా కొన్ని వారాల తర్వాత అక్టోబర్ 7న గవర్నర్ సుందర్ సింగ్ భండారి సమక్షంలో మోదీ గుజరాత్ 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తేదీ ఆయనను భారత రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేర్చిన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది. 2026 అక్టోబర్ 7 నాటికి ఆయన ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఇందులో 4,495 రోజులు భారతదేశంలో అత్యధిక కాలం పాటు వరుసగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన సేవలందించడం విశేషం.
గుజరాత్‌కు చెందిన మోదీకి పార్టీలో అప్పటికే తన సంస్థాగత నైపుణ్యాలు, కొత్త బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే గుణం కారణంగా మంచి గుర్తింపు ఉండేది. కానీ ఆ ముఖ్యమంత్రి పదవి క్లిష్టమైన సవాళ్లతో కూడుకుని ఉంది. భూకంపం కేవలం విషాదాన్నే కాకుండా, నాటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఆ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. ఆ రాష్ట్రం అప్పటికే చాలా కాలంగా కరువుతో పోరాడుతోంది.
ప్రజలు నీరు, కనీస సౌకర్యాల కోసం అల్లాడుతుండగా, అధికార యంత్రాంగం మాత్రం అసమర్థంగా, అస్తవ్యస్తంగా ఉన్నట్టు కనిపించింది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన మొదటి సంవత్సరం, తదుపరి 11 ఏళ్ల పాలనకు ఒక నమూనాను సిద్ధం చేసింది. భారీ ప్రాజెక్టులను నిర్ణీత 100 రోజుల్లో ప్రారంభించడం వంటి అనేక విధానాలు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి మోదీ కేంద్రంలో నాయకత్వం వహించినప్పుడు అక్కడ కూడా అమలు చేయడం చేపట్టారు.
"తన తొలిరోజుల పాలన గురించి మోదీ చెబుతూ పరిపాలనా అనుభవం లేకుండానే సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర పగ్గాలను చేపట్టడంతో పలు సవాలు ఎదురైనట్టు చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకున్న అవగాహన, వారి జీవితాలను మార్చే విధానాలను ముందుకు తీసుకురావడానికి ఈ అనుభవం దోహదపడింది. సంఘ్ సిద్ధాంతం, అంత్యోదయ (వరుసలో చివరి వ్యక్తిని పైకి లేపడం)పై ఆయనకున్న అనుభవం, పట్టుదల రాష్ట్రంలో సాంఘిక సంక్షేమానికి పునాది వేసింది," అని ఆయన గురించి సన్నిహితంగా తెలిసిన ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడు పేర్కొన్నారు.
{{/usCountry}}"తన తొలిరోజుల పాలన గురించి మోదీ చెబుతూ పరిపాలనా అనుభవం లేకుండానే సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర పగ్గాలను చేపట్టడంతో పలు సవాలు ఎదురైనట్టు చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకున్న అవగాహన, వారి జీవితాలను మార్చే విధానాలను ముందుకు తీసుకురావడానికి ఈ అనుభవం దోహదపడింది. సంఘ్ సిద్ధాంతం, అంత్యోదయ (వరుసలో చివరి వ్యక్తిని పైకి లేపడం)పై ఆయనకున్న అనుభవం, పట్టుదల రాష్ట్రంలో సాంఘిక సంక్షేమానికి పునాది వేసింది," అని ఆయన గురించి సన్నిహితంగా తెలిసిన ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడు పేర్కొన్నారు.
{{/usCountry}}2003లో ప్రారంభించిన 'వైబ్రంట్ గుజరాత్', ఆ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా మార్చింది. గ్రామాలకు స్థిరమైన విద్యుత్ సరఫరా కోసం 'జ్యోతిగ్రామ్' పథకం వ్యవసాయ, గృహ ఫీడర్లను వేరు చేసింది. ఆయన ప్రణాళికబద్దంగా గుజరాత్‌ను అభివృద్ది చేశారు. 25 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఏ ఒక్క విధానంతోనో కాకుండా, 'సంస్కరించు, సాధించు, పరివర్తన చెందు' అనే ఒక నిబద్దతతో కూడిన పాలనా తర్కంతో వ్యవహరించారు. దీని వెనుక 'దేశమే ప్రథమం', 'కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన' అనే సూత్రాలు అంతర్లీనంగా పనిచేశాయి. ప్రజా జీవనంలో ఆయన ఎదుగుదల అనూహ్యమైనది. ఆయన క్షేత్రస్థాయి కార్యకర్త నుండి ప్రధాన్ సేవక్‌గా ఎదిగారు. 2026 సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజున ప్రారంభించిన 'సేవా సంకల్ప్ అభియాన్' స్ఫూర్తి గా నిలుస్తూ 2047 నాటికి వికసిత భారత్ దిశగా కొనసాగుతుంది.
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు…. అనేక ప్రాజెక్టులు, ప్రణాళికల ద్వారా రాష్ట్రాన్ని సమూలంగా మార్చినందుకు ప్రశంసలు పొందారు. మౌలిక సదుపాయాల కల్పన, ఎండిపోయిన భూములకు నీటిని అందించడం, రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణం నుండి కొత్త పరిశ్రమల స్థాపన వరకు... అన్నీ కలిసి ప్రఖ్యాత 'గుజరాత్ మోడల్'ను రూపొందించాయి.
"పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నప్పటి నుండే ఆయన మార్పులకు, సవాళ్లకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ వచ్చారు," అని సహచర బిజెపి నాయకులు పేర్కొంటారు. 1995 నుండి 2001 వరకు పార్టీ కార్యకర్తగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటన అనుభవాలు ఆయనకు భారతీయుల జీవనశైలి, రాజకీయ జీవితంలోని విశేషాలపై లోతైన అవగాహన కల్పించాయి. సవాళ్లను ఎదుర్కోవడంలోనూ, ప్రతిపక్షాలను అధిగమించడంలోనూ ప్రధానికున్న 'తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే' దిశగా ఆయనకు ఆ అనుభవాలు తోడ్పడుతున్నాయి.
"ఆయన తదుపరి ఏం చేస్తారో అని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలోనే, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే సామర్థ్యంతో ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఆయన ఇతరుల మాటలను శ్రద్ధగా వింటార. సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను సూచించడానికి తగిన సమయాన్ని కేటాయిస్తారు. అందుకే 2014 నుండి ఆయన నాయకత్వంలో దేశంలో మార్పు సాధ్యమవుతోంది," అని ఆ ఓ రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. ప్రధాని మాటల్లో చెప్పాలంటే, 2013లో బీజేపీ తరఫున ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, దేశం విశ్వసనీయత, పాలనాపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. "అప్పటి యూపీఏ ప్రభుత్వం అత్యంత దారుణమైన అవినీతి, బంధుప్రీతి, విధానపరమైన స్తంభనకు మారుపేరుగా నిలిచింది. ప్రపంచ వేదికపై భారత్ ఒక బలహీనమైన దేశంగా పరిగణించబడేది. కానీ, భారత ప్రజల విజ్ఞత మా కూటమికి భారీ మెజారిటీని అందించడమే కాకుండా, మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మా పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించేలా చేసింది," అని ప్రధాని గత ఏడాది ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటడంతో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉన్నప్పటికీ, 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం 7.8 శాతం జీడీపీ వృద్ధి నమోదు చేసింది. ఉద్దేశపూర్వక విధానాల రూపకల్పన వలన, ఇంధన సరఫరా గొలుసులను నేరుగా నిర్వహించడం ద్వారా రిటైల్ ధరల పెరుగుదలను 5 శాతం కంటే తక్కువకు పరిమితం చేయడం సాధ్యమైంది. తద్వారా, ఇతర దేశాలలోని అనేక చమురు ఎగుమతి, దిగుమతి ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న అంతరాయం లేకుండా, ఎల్‌పిజి గృహాలకు, ఇంధనం వాహనాలకు నిరంతరాయంగా చేరాయి.
2014-15లో రూ. 2 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయం, 2026-27 బడ్జెట్ నాటికి రూ. 12.2 లక్షల కోట్లకు పెరిగింది. అదే సమయంలో, ద్రవ్యలోటు జిడిపిలో 9.2 శాతం నుండి బడ్జెట్‌లో కేటాయించిన 4.3 శాతానికి తగ్గింది. జన్ ధన్ ఖాతాలు, ఆధార్ గుర్తింపు, మొబైల్ కనెక్టివిటీ అనే జనత్రయం ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, సంతృప్త సంక్షేమానికి కార్యాచరణ వెన్నెముకగా ఏర్పడింది. ఇది చివరికి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 314 లక్షల కోట్ల విలువైన ప్రపంచవ్యాప్త రియల్-టైమ్ చెల్లింపులలో 49% నిర్వహించే యుపిఐ నెట్‌వర్క్‌కు శక్తినిచ్చింది.
భౌతిక మౌలిక సదుపాయాల రంగంలో కూడా ఇదే విధమైన వేగవంతమైన అభివృద్ధి కనిపించింది. జాతీయ రహదారుల విస్తరణ వేగం 2013-14లో రోజుకు సుమారు 12 కిలోమీటర్ల నుండి 2025 నాటికి రోజుకు 34 కిలోమీటర్లకు పెరిగింది. భారతదేశ సెమీకండక్టర్ రంగం స్వల్ప కాలంలోనే వేగంగా పురోగమించింది. 2021లో దేశంలో ఒక్క వాణిజ్య చిప్ ప్లాంట్ కూడా లేదు. 2026 నాటికి, పన్నెండు యూనిట్లకు ఆమోదం లభించగా, ఐదు ఉత్పత్తిలో ఉన్నాయి. వందలాది కళాశాలల్లోని విద్యార్థులు ఇప్పుడు చిప్‌లను డిజైన్ చేస్తున్నారు.
భారతదేశ అధ్యక్షతన న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కు ఆతిథ్యం ఇస్తూ, ప్రధాని మోదీ విచ్ఛిన్నమైన ప్రపంచం నలుమూలల నుండి నాయకులను ఒకచోట చేర్చారు. ఈ సంవత్సరం భారతదేశ అధ్యక్షతన, బ్రిక్స్ 'గ్లోబల్ సౌత్'కు ప్రాధాన్యతనిచ్చింది. వాతావరణ మార్పులను పసిగట్టి రైతుల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, బ్రిక్స్ దేశాలు స్వీకరించడానికి వీలుగా భారతదేశపు సొంత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఈ శిఖరాగ్ర సమావే శంలో విజయవంతంగా ప్రవేశ పెట్టడం దేశానికి గొప్ప విజయం. విదేశాంగ విధానం పట్ల మోదీ అనుసరిస్తున్న 'విశ్వామిత్ర' వైఖరికి ఇది స్పష్టమైన నిదర్శనం.
కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు, కొన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశాలు వాటిని సరఫరా చేయడానికి సుముఖంగా లేనప్పుడు, ప్రధాని మోదీ 'వ్యాక్సిన్ మైత్రి'ని ప్రారంభించారు. 'వసుధైవ కుటుంబకం', అంటే 'ప్రపంచం ఒకే కుటుంబం' అనే నినాదానికి స్ఫూర్తినిచ్చిన అదే దృఢ విశ్వాసం, భారతదేశం 2023 జీ20 అధ్యక్షతకు కేంద్రంగా నిలిచింది. అంతేకాకుండా, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా యుద్ధాల నుండి అమెరికా వాణిజ్య విధానంలోని ఒడిదుడుకుల వరకు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గందరగోళం, భౌగోళిక రాజకీయ పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసినా మోదీ చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు సాగారు.
25 ఏళ్ల ప్రజాజీవితంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన మోదీ ప్రయాణం ప్రధానిగా ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం వరకు సాగింది. విధానాల్లో మార్పు, సాంకేతికతకు ప్రాధాన్యం, సంక్షేమాన్ని చివరి వ్యక్తికి చేర్చాలన్న సంకల్పమే ఈ ప్రస్థానంలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘దేశమే ప్రథమం’ అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రయాణం రాబోయే కాలంలో భారతదేశ భవిష్యత్ దిశను మరింతగా ప్రభావితం చేయనుంది.
- విశ్లేషణ : లింగమనేని రమేశ్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), జనసేన పార్టీ