నేపాల్‌లో సంభవించిన వరద విపత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ నివాసితులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
నేపాల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారి గురించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న ప్రజల గురించి సమాచారం కోరుకునే వారు ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101ని సంప్రదించవచ్చు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి, ప్రభావిత యాత్రికులకు సహాయం అందించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు విదేశీ గడ్డపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేపాల్‌లో ఆకస్మిక వరదల ధాటికి చైనా సరిహద్దు ప్రాంతంలో వీరు చిక్కుకుపోవడంతో స్వదేశానికి ఎలా తిరిగొచ్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఆదోని పట్టణానికి చెందిన భాస్కరశాస్త్రి, ఆయన భార్య శారద, కుమారుడు రఘునాథశాస్త్రి, కోడలు హన్సికలు ఈ నెల 10వ తేదీన బెంగళూరు నుంచి మానసరోవర్ యాత్రకు వెళ్లారు. దేశవ్యాప్తంగా మొత్తం 156 మంది యాత్రికులతో కూడిన బృందంలో వీరు నేపాల్ చేరుకున్నారు. అక్కడ వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అనంతరం, ఈ నెల 25 నాటికి విజయవంతంగా మానసరోవర్ దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు.
మానసరోవర్ దర్శనం అనంతరం యాత్రికులంతా కైలాస పరిక్రమకు సిద్ధమయ్యారు. అయితే భాస్కరశాస్త్రి కుటుంబంతో సహా మొత్తం 16 మంది ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురికావడంతో వారు పరిక్రమను విరమించుకున్నారు. దీంతో వీరంతా నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండే చైనా భూభాగంలోని డార్చింగ్ అనే ప్రాంతంలోని ఒక హోటల్లో బస చేశారు.
{{/usCountry}}మానసరోవర్ దర్శనం అనంతరం యాత్రికులంతా కైలాస పరిక్రమకు సిద్ధమయ్యారు. అయితే భాస్కరశాస్త్రి కుటుంబంతో సహా మొత్తం 16 మంది ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురికావడంతో వారు పరిక్రమను విరమించుకున్నారు. దీంతో వీరంతా నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండే చైనా భూభాగంలోని డార్చింగ్ అనే ప్రాంతంలోని ఒక హోటల్లో బస చేశారు.
{{/usCountry}}నేపాల్‌లో వరదలకు డార్చింగ్ నుంచి కఠ్‌మాండూ వైపు వెళ్లే ప్రధాన రహదారులు, వంతెనలు వరద నీటి ధాటికి కొట్టుకుపోయాయి. సెప్టెంబరు 1న కఠ్‌మాండూ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చేందుకు వీరు ముందస్తుగానే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే దారులు మొత్తం మూతపడటంతో అక్కడి నుంచి కఠ్‌మాండూ చేరుకోవడం అసాధ్యంగా మారింది.