నేపాల్‌లో చిక్కుకున్న ఏపీవారిని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు

Nepal Floods : నేపాల్‌‌లో వరద బీభత్సం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడి నుంచి టూరిస్టులుగా వెళ్లిన వారి ఆచూకీపై గందరగోళం నెలకొన్నది.

Published on: Aug 27, 2026, 09:59:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేపాల్‌లో సంభవించిన వరద విపత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ నివాసితులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

నేపాల్ వరదలు
నేపాల్ వరదలు

నేపాల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారి గురించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న ప్రజల గురించి సమాచారం కోరుకునే వారు ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101ని సంప్రదించవచ్చు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి, ప్రభావిత యాత్రికులకు సహాయం అందించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

కైలాస మానసరోవర్‌ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు విదేశీ గడ్డపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేపాల్‌లో ఆకస్మిక వరదల ధాటికి చైనా సరిహద్దు ప్రాంతంలో వీరు చిక్కుకుపోవడంతో స్వదేశానికి ఎలా తిరిగొచ్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఆదోని పట్టణానికి చెందిన భాస్కరశాస్త్రి, ఆయన భార్య శారద, కుమారుడు రఘునాథశాస్త్రి, కోడలు హన్సికలు ఈ నెల 10వ తేదీన బెంగళూరు నుంచి మానసరోవర్‌ యాత్రకు వెళ్లారు. దేశవ్యాప్తంగా మొత్తం 156 మంది యాత్రికులతో కూడిన బృందంలో వీరు నేపాల్ చేరుకున్నారు. అక్కడ వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అనంతరం, ఈ నెల 25 నాటికి విజయవంతంగా మానసరోవర్‌ దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు.

మానసరోవర్ దర్శనం అనంతరం యాత్రికులంతా కైలాస పరిక్రమకు సిద్ధమయ్యారు. అయితే భాస్కరశాస్త్రి కుటుంబంతో సహా మొత్తం 16 మంది ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురికావడంతో వారు పరిక్రమను విరమించుకున్నారు. దీంతో వీరంతా నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండే చైనా భూభాగంలోని డార్చింగ్ అనే ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేశారు.

నేపాల్‌‌లో వరదలకు డార్చింగ్ నుంచి కఠ్‌మాండూ వైపు వెళ్లే ప్రధాన రహదారులు, వంతెనలు వరద నీటి ధాటికి కొట్టుకుపోయాయి. సెప్టెంబరు 1న కఠ్‌మాండూ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చేందుకు వీరు ముందస్తుగానే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే దారులు మొత్తం మూతపడటంతో అక్కడి నుంచి కఠ్‌మాండూ చేరుకోవడం అసాధ్యంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More