ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 21 నుంచి అందుబాటులోకి కొత్త అన్నదానం, లడ్డూ తయారీ భవనాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంది. ఆగస్టు 21 నుంచి కొత్త అన్నదానం, లడ్డూ తయారీ భవనాలు అందుబాటులోకి తీసుకువస్తుంది.

Published on: Aug 15, 2026, 05:58:48 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆలయ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త అన్నదానం, లడ్డూ తయారీ (లడ్డూ పోటు) భవనాలను ఈ నెల 21వ తేదీన వైభవంగా ప్రారంభించనున్నారు.

కనకదుర్గ ఆలయం
కనకదుర్గ ఆలయం

ఈ నూతన వసతుల ద్వారా అమ్మవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతంగా, శుచిగా రూపుదిద్దుకోనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఆలయ చైర్మన్, ఈవో, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన అన్నదాన కౌంటర్, లడ్డూ పోటు భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆగస్టు 21న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనాల ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు.

సుమారు రూ.25 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ ఆధునిక వంటశాలలో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 10,000 మంది భక్తులకు భోజన వసతి కల్పించేలా డిజైన్ చేశారు. దాదాపు రూ.26 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపొందించారు. ఈ కేంద్రంలో గంటకు ఏకంగా 60,000 లడ్డూలను తయారు చేసే సామర్థ్యం ఉంది.

త్వరలో రాబోయే విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు, ప్రతి ఒక్కరికీ నిరీక్షణ లేకుండా లడ్డూ ప్రసాదం అందించేందుకు దసరా సమయంలో ప్రత్యేక హోల్డింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంద్రకీలాద్రిపై మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తనిఖీ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఆలయానికి వచ్చిన భక్తులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యానికే మా మొదటి ప్రాధాన్యత. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి.' అని కేశినేని శివనాథ్ చెప్పారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఆలయ ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థాన సిబ్బంది, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ నూతన సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఇంద్రకీలాద్రికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల కొరత తీరనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More