AP Hundi Note Viral : ‘స్వామి.. మా అత్త త్వరగా చనిపోవాలి..! ఆలయ హుండీలో నోటు చూసి అందరూ షాక్
AP Hundi ₹20 Note Viral : అనంతపురం జిల్లాలోని ఓ ఆలయంలో హుండీ కానుకలు లెక్కిస్తుండగా అధికారులకు షాకింగ్ నోటు లభించింది. అత్త వేధింపులు భరించలేకపోతున్నానని…. ఆమె త్వరగా చనిపోయేలా చూడాలని ఒక భక్తురాలు రూ. 20 నోటుపై రాసి హుండీలో వేశారు.
AP Hundi ₹20 Note Viral : సాధారణంగా భక్తులు దేవుడికి మొక్కుబడులు చెల్లించుకోవడానికి, తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ గుడిలోని హుండీల్లో కానుకలు వేస్తుంటారు. మంచి ఉద్యోగం రావాలని…. ఆరోగ్యం బాగుండాలని, పెళ్లి కావాలనో లేదా వ్యాపారంలో లాభాలు రావాలనో కోరుకుంటూ హుండీల్లో డబ్బులు వేయడం మనం ఎప్పుడూ చూసేదే. కానీ అనంతపురం జిల్లాలోని ఓ ఆలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసేలా వింత ఘటన వెలుగు చూసింది. "మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామి," అంటూ ఒక రూ. 20 కరెన్సీ నోటుపై రాసి ఉన్న లేఖ ఆలయ సిబ్బందిని, భక్తులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

రూ. 20 నోటుపై రాసి…
ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ ఘటన అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది కలిసి హుండీలోని కానుకలను లెక్కిస్తున్న సమయంలో ఈ వింత నోటు వారి కంటపడింది. భక్తులు సమర్పించిన నోట్ల కట్టలను విడదీసి చూస్తున్న క్రమంలో ఒక చోట చేతిరాతతో రాసి ఉన్న ఇరవై రూపాయల నోటు కనిపించింది. దానిపై ఉన్న అక్షరాలను చదివిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ నోటుపై చాలా బాధతో, వేడుకుంటున్నట్లుగా ఒక సందేశాన్ని రాశారు. "స్వామి…. నా అత్త పెట్టే వేధింపులను నేను ఇక ఏమాత్రం భరించలేకపోతున్నాను. దయచేసి ఆమె త్వరగా చనిపోయేలా చూడు," అని ఆ నోటుపై రాసి ఉంది. ఈ వింత కోరికను చూసి అక్కడున్న ఆలయ సిబ్బంది, అధికారులు కాసేపు లెక్కింపు ఆపేసి ఆ నోటును పదే పదే చదివారు. ఈ వింత మొక్కు చూసి కొందరు నవ్వుకోగా, మరికొందరు మాత్రం ఆ కుటుంబంలో ఉన్న తీవ్రమైన విభేదాలు, పగను చూసి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ హుండీ నోటుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుండటంతో స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

