జూలై 15 లోపు ఇంద్రకీలాద్రిపై నూతన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం ప్రారంభం

జూలై 15 లోపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నూతన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం ప్రారంభం కానుంది. దీంతో భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Updated on: Jun 22, 2026, 16:00:26 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులకు దేవాదాయ శాఖ తీపి కబురు అందించింది. కొండపై నూతనంగా అత్యాధునిక వసతులతో నిర్మించిన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం (పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాబోయే జూలై 15వ తేదీ లోపు ఈ భవనాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.

విజయవాడ దుర్మమ్మ గుడి
విజయవాడ దుర్మమ్మ గుడి

దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై సుడిగాలి పర్యటన చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. దుర్గగుడి ఈవో, ఇంజనీరింగ్ అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది, ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారి కనీస అవసరాలైన అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నూతన కేంద్రాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న అన్నదానం హాల్‌లో భక్తుల రద్దీ దృష్ట్యా, మరింత విశాలమైన, పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు భోజన సదుపాయం కల్పించేందుకు ఈ నూతన భవనాన్ని నిర్మించారు. అలాగే అమ్మవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర ప్రసాదాలను అత్యంత పరిశుభ్రమైన(హైజీనిక్) పద్ధతిలో, అత్యాధునిక యంత్రాల సాయంతో తయారు చేసేందుకు వీలుగా కొత్త ప్రసాదాల తయారీ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల ప్రసాదాల నాణ్యత పెరగడమే కాకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేసే అవకాశం ఉంటుంది.

జూలై 15లోపు ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More