...
...
Next Story

ఆంధ్రా కశ్మీర్‌లో సరికొత్త అందాలు.. లంబసింగిలో పూల తోటలతో రైతుల బిజినెస్!

ఆంధ్రాలోని లంబసింగి అనగానే మెుదటగా గుర్తొచ్చేది చలి. ఈ ప్రదేశాన్ని చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. లంబసింగిని రైతులు పూల లోయగా మారుస్తున్నారు.

Published on: Jan 21, 2026, 14:18:06 IST
Advertisement

లంబసింగి.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ ప్రకృతిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది రైతులు పూల తోటలను పెంచుతున్నారు. దీని ద్వారా బిజినెస్ చేస్తున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి, ఇతర మైదాన ప్రాంతాలకు చెందిన కౌలు రైతులు లంబసింగి ప్రాంతంలో స్థానిక రకం, ఇతర పువ్వులను పెంచుతున్నారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.

లంబసింగి
లంబసింగి

ఈ రైతులు నాగ్‌పూర్, పూణే, బెంగళూరు, ఏపీలోని కడియం నుండి మొక్కలు, విత్తనాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పూల లోయగా మార్చుతున్నారు. వివిధ రకాల బంతి, చామంతి, గెర్బెరా, దాలియాతోపాటుగా మరికొన్ని పువ్వులను పెంచుతున్నారు.

అయితే దీనిని ప్రొఫెషనల్‌గా కాకుండా సైడ్ ఇన్‌కమ్‌లా చూస్తున్నారు రైతులు. పర్యాటకుల నుండి కొంత డబ్బు పొందుతున్నారు. పూల తోటలను సందర్శించడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఒక్కరి దగ్గర రూ.30 నుంచి రూ.40 వరకు తీసుకుంటున్నారు. లంబసింగి వచ్చి.. మంచు, చలిలో ఫొటోలు దిగితే వచ్చే కిక్కును పర్యాటకులు కూడా ఇష్టపడుతున్నారు. దీనితో రైతులు అదే పనిలో ఉన్నారు. అంతేకాదు గ్లాడియేలస్‌లాంటి డెకరేషన్ పూల సాగు కూడా మెుదలిపెట్టి ఆపేసినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు పాడేరులో 50 హెక్టార్లలో బంతిపూలను పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. దాదాపు 150 మంది రైతులు ఉన్నారు. ఉద్యానవన శాఖ వారికి 50 సెంట్లకు రూ.3,000 చెల్లిస్తుందని తెలుస్తోంది. ఈ రైతులు స్థానిక వ్యాపారులకు పూలు అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. ఈ పథకాన్ని త్వరలో ఇతర మండలాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఆ శాఖ ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe