ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు ఆసక్తిగా మారింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా రోజులుగా మదనపల్లె, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఏర్పాటు అవుతాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇవి ఖరారు అయిపోయినట్టే. అయితే తాజాగా మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది.

రంపచోడవరం, చింతూరు డివిజిన్లు ప్రస్తుతం అల్లూరి సితారామరాజు జిల్లాలో ఉన్నా.. అవి తూర్పుగోదావరి జిల్లాలో కలిస్తే జిల్లా విస్తీర్ణం, జనాభా మరింత పెరుగుతుంది. పోలవరం ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రంపచోడవరాన్ని కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేసే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు కూడా సులువుగా ఉంటుందని చర్చకు వచ్చింది. దీనికి కూడా సీఎం చంద్రబాబు ప్రాథమిక ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పోలవరం ముంపు మండలాలకు ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
గన్నవరం, నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. స్థానిక నేతలు చెప్పారనే కారణంతో చేరుస్తారా.. భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు సీఎం. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల సరిహద్దులను పరిశీలించాలని, తదనుగుణంగా మార్పులు చేయాలని ఆదేశించారు.
నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిరలు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు అవుతాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. మరికొన్ని డివిజన్లలో కూడా మార్పులు రానున్నాయి. కొత్త డివిజన్లకు ఆమోదం లభిస్తే.. మెుత్తం 81 డివిజన్లు కానున్నాయి.
కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పుపై మరోసారి సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో చర్చించిన తర్వాత తదనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.
{{/usCountry}}కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పుపై మరోసారి సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో చర్చించిన తర్వాత తదనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.
{{/usCountry}}