...
...
Next Story

Andhrapradesh MBBS Seats : విద్యార్థులకు గుడ్ న్యూస్ - మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు..!

Andhrapradesh MBBS Seats : ఆంధ్రప్రదేశ్‌లోని కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు.

Published on: Jul 11, 2026 10:28 AM IST
Advertisement

Andhrapradesh MBBS Seats : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా మరో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్ల కేటాయింపునకు జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ కాలేజీల్లో సీట్లు పెంపు….

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జాతీయ వైద్య కమిషన్ ఈ అదనపు సీట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ (ACSR) ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్లను అదనంగా కేటాయించారు.

మంత్రి సత్య కుమార్ యాదవ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం…. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి గాను కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 సీట్లు, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 సీట్లను పెంచుతూ ఎన్‌ఎమ్‌సీ 'లెటర్ ఆఫ్ పర్మిషన్' (LoP) జారీ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ అదనపు సీట్ల కేటాయింపుతో ఆయా కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇప్పటివరకు కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా… తాజా పెంపుతో ఆ సంఖ్య 250కి చేరుకుంది. అదేవిధంగా, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు కాస్తా ఇకపై 200 సీట్లకు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో మరికొంత మంది స్థానిక విద్యార్థులకు ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే సువర్ణావకాశం లభిస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe