...
...
Next Story

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. కొత్త నిబంధన!

Vijayawada Durga Temple : విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. సెల్‌ఫోన్ తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. అంతేకాదు సరికొత్త సెక్యూరిటీ స్కానింగ్ గేట్ కూడా ఏర్పాటు చేశారు.

Published on: Aug 14, 2026, 07:39:16 IST
Advertisement

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భద్రతను పటిష్టం చేస్తూ, భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు తీసుకువెళ్లడంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఈ మేరకు ఆలయ ఈవో సీనా నాయక్ కీలక ప్రకటన విడుదల చేశారు.

విజయవాడ కనకదుర్గ ఆలయం
విజయవాడ కనకదుర్గ ఆలయం

దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను పెంపొందించడం, అలజడి లేకుండా ప్రశాంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంలో సరికొత్త సెక్యూరిటీ స్కానింగ్ గేట్ ఏర్పాటు చేశారు. హోం గార్డులు, ఏజైల్ సెక్యూరిటీ సిబ్బంది ఈ గేట్ వద్ద భక్తులను నిశితంగా తనిఖీ చేస్తారు. స్కానింగ్ పాయింట్ దాటి ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. క్యూ లైన్లలోకి వెళ్లడానికి ముందే భక్తులు తమ మొబైల్ ఫోన్లను కేటాయించిన డిపాజిట్ కౌంటర్లలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.

సెల్ ఫోన్లు డిపాజిట్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, భక్తులు తదనుగుణంగా తమ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆలయ యంత్రాంగం కోరింది.

దర్శనం కోసం వచ్చే భక్తుల క్యూ లైన్లలో ఎలాంటి అడ్డంకులు, నెట్టివేతలు జరగకుండా ఉండేందుకు ఆలయ ప్రాంగణంలో పలు సర్వీస్ కౌంటర్లను వేరే ప్రాంతాలకు తరలించారు. దర్శనం టికెట్ కౌంటర్లు ప్రవేశ ద్వారం వద్ద రద్దీ తగ్గించేలా దూరంగా పునర్నిర్మించారు. ఉచిత లడ్డూ ప్రసాదం కౌంటర్లు దర్శనం పూర్తిచేసుకుని బయటకు వచ్చే మార్గంలో క్రమబద్ధీకరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe