AP University Recruitment 2026 : ఏపీ యూనివర్శిటీల్లో 1,523 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలివే
AP University Recruitment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ పోర్టల్ ద్వారా మే 18వ తేదీ నుంచి జూన్ 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
AP University Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వంటి కీలక కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 1523 ఖాళీలు….
మొత్తం 1,523 పోస్టులలో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా.... మిగిలిన 279 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీలుగా ఉన్నాయి. ఈ నియామకాలను రాబోయే 6 నెలల్లోపు అత్యంత పారదర్శకంగా పూర్తి చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్ ఫ్యాకల్టీని పెంచడానికి ప్రభుత్వం దశలవారీగా చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. అర్హులైన శాశ్వత అధ్యాపకుల నియామకం వల్ల కాలేజీల్లో నాణ్యమైన బోధన, పరిశోధనలు మెరుగవుతాయని, తద్వారా వర్సిటీలకు జాతీయ స్థాయిలో NAAC, NIRF ర్యాంకింగ్స్ సాధించే అవకాశం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ప్రభుత్వ వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (RGUKT) లో 311 పోస్టులు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) లో 246 పోస్టులు, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) లో 125 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అనంతపురంలోని ఎస్‌కేయూ (103 పోస్టులు), జేఎన్‌టీయూ అనంతపురం (95 పోస్టులు), గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (82 పోస్టులు) సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 19 ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ నియామకాలు జరుగుతాయి.
హోదాల వారీగా ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్: 63 (రెగ్యులర్: 63, బ్యాక్‌లాగ్: 0)
- అసోసియేట్ ప్రొఫెసర్: 334 (రెగ్యులర్: 191, బ్యాక్‌లాగ్: 143)
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020 (రెగ్యులర్: 886, బ్యాక్‌లాగ్: 134)
- లెక్చరర్ (కేవలం RGUKTలో): 104 (రెగ్యులర్: 104, బ్యాక్‌లాగ్: 0)
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 (రెగ్యులర్: 0, బ్యాక్‌లాగ్: 2)
దరఖాస్తు తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 18
- ఆన్‌లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ: జూన్ 8
- దరఖాస్తుల హార్డ్ కాపీ సమర్పించడానికి గడువు: జూన్ 15
- అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమిక అర్హత జాబితా వెల్లడి: జూన్ 22
- అర్హత జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: జూన్ 29 వరకు
- స్క్రీనింగ్ టెస్ట్‌కు తుది అర్హత జాబితా విడుదల: జూన్ 30
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా....
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నియామకాల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను ( https://apuniversitiesrecruitment.apcfss.in ) అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు ఈ సింగిల్ విండో పోర్టల్‌లో ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుని, మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, భవిష్యత్ సంప్రదింపులన్నీ ఈ స్మార్ట్ పోర్టల్ ద్వారానే సాగుతాయి. ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన నైపుణ్యం పోర్టల్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

