AP Local Elections : ఏపీలో స్థానిక ఎన్నికలపై కసరత్తు - ఓటర్ల జాబితా ప్రక్రియ ప్రారంభం..!
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ అయింది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్దం చేయాలని పేర్కొంటూ వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వచ్చే నెల 9వ తేదీనాటికి ఓటర్ లిస్ట్ సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లోనూ మరికొన్ని రోజుల్లోనే పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

ముగియనున్న పదవీకాలం…
ఒకటి, రెండు నెలల్లో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాల రూపకల్పనపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం శనివారం వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసింది. కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియను వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది. వచ్చే నెల 9వ తేదీన ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాలు ప్రచురించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్రంలో 13,098 పంచాయతీల్లోని కొనసాగుతున్న పాలకమండలి పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. అంటే మరో 2 నెలలు మాత్రమే గడువు ఉంది. కోర్టు కేసులతో 253 పంచాయతీల్లో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న మొత్తం 13,351 పంచాయతీల్లోనూ తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా సెప్టెంబర్ లో ముగుస్తుంది.
ఇక పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం మార్చి 17వ తేదీతో పూర్తవుతుంది. గతంలో 36 చోట్ల కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఇదిలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తారు.
వార్డుల విభజన, ఓటర్ల నమోదు , అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను మార్చి 9వ తేదీలోపు పూర్తి చేస్తారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి…. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాలని ఎస్ఈసీ…. ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది.
సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ… గ్రామాల్లోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వాళ్లు… పావులు కదిపే పనిలో పడ్డారు. రిజర్వేషన్ల ఖరారు అయితే… పోటీపై మరింత స్పష్టతకు రానున్నారు. ఇక మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రధాన పార్టీలలో పని చేస్తున్న పలువురు నేతలు… ఇప్పట్నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

