AP Cooperative Bank Recruitment Notification 2026 : ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం లభించింది. ఏపీలోని పలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 338 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 295 స్టాఫ్ అసిస్టెంట్ (క్లర్క్), 43 అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-I) పోస్టులు ఉన్నాయి. సొంత జిల్లాలోనే పని చేసే అవకాశం ఉండటం… నెలకు రూ.45 వేలకు పైగా ఆకర్షణీయమైన ప్రారంభ వేతనం లభించనుండటంతో అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తోంది.
ఆగస్ట్ 7 వరకు గడువు….
దరఖాస్తు ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభం కాగా…. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7, 2026 వరకు గడువు ఉంది.ఈ నోటిఫికేషన్ కింద రాష్ట్రంలోని ఆరు జిల్లాల కోఆపరేటివ్ బ్యాంకుల్లో నియామకాలు చేపడుతారు.
- ప్రకాశం డీసీసీబీ : 80 పోస్టులు (60 స్టాఫ్ అసిస్టెంట్, 20 అసిస్టెంట్ మేనేజర్) .
- చిత్తూరు డీసీసీబీ: 75 పోస్టులు (అన్నీ స్టాఫ్ అసిస్టెంట్) .
- కడప డీసీసీబీ: 63 పోస్టులు (40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్) .
- నెల్లూరు డీసీసీబీ: 48 పోస్టులు (అన్నీ స్టాఫ్ అసిస్టెంట్).
- విశాఖపట్నం డీసీసీబీ: 47 పోస్టులు (అన్నీ స్టాఫ్ అసిస్టెంట్) .
- విజయనగరం డీసీసీబీ: 25 పోస్టులు (అన్నీ స్టాఫ్ అసిస్టెంట్).
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ లేదా కామర్స్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుదారులు ఇంగ్లీష్ భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో నైపుణ్యం కలిగి ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా అభ్యర్థులు ఏ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దరఖాస్తు చేస్తున్నారో ఆ జిల్లాకే చెందిన స్థానికులై ఉండాలనే నిబంధన విధించారు.
{{/usCountry}}దరఖాస్తుదారులు ఇంగ్లీష్ భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో నైపుణ్యం కలిగి ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా అభ్యర్థులు ఏ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దరఖాస్తు చేస్తున్నారో ఆ జిల్లాకే చెందిన స్థానికులై ఉండాలనే నిబంధన విధించారు.
{{/usCountry}}దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. బీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అదనపు అలవెన్సులతో కలిపి ప్రారంభ వేతనం సుమారు రూ.47,000 వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకు సుమారు రూ.62,000 పైచిలుకు అలవెన్సులతో కూడిన జీతం లభిస్తుంది.
ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.826 కాగా… ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికోద్యోగులకు రూ.590 గా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ జిల్లా సహకార బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆగస్టు 7 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
- దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 7, 2026
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ : ఆగస్టు లేదా సెప్టెంబరు 2026లో నిర్వహించనున్నారు.
- అధికారిక వెబ్ సైట్ : https://apcob.bank.in/careers/