SSCTU Mulugu UG Admissions : సమ్మక్క -సారక్క సెంట్రల్ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల
Sammakka Sarakka Central Tribal University : ములుగు సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీలో 2026-27 డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు… ఆగస్టు 3 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. https://ssctu.ac.in/admissions/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Sammakka Sarakka Central Tribal University : ములుగు జిల్లాలో ఏర్పాటైన ప్రతిష్టాత్మక 'సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం' (SSCTU) నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యా సంస్థల్లో ఒక్కటైనా ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం, అకాడమిక్ మద్దతుతో విశ్వవిద్యాలయం కీలక కోర్సులను ఆఫర్ చేస్తోంది. సీయూఈటీ యూజీ (CUET UG, జేఈఈ మెయిన్స్ (JEE Main) ప్రవేశ పరీక్షల ద్వారా సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ ప్రో. వై.ఎల్. శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
కోర్సుల వివరాలు….
2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 5 విభిన్నమైన నలుగు సంవత్సరాల యూజీ ప్రోగ్రామ్‌లలో మొత్తం 130 సీట్లను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి….
- బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : ఐఐటీ హైదరాబాద్ తో కలిసి అందిస్తున్న ఈ 4 ఏళ్ల కోర్సులో మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ : ఐఐటీ హైదరాబాద్ సహకారంతో అందించే ఈ కోర్సులో 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఎస్సీ హానర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ : ఐఐటీ హైదరాబాద్ అకాడమిక్ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ 4 ఏళ్ల కోర్సులో 25 సీట్లు కేటాయించారు.
- బీఏ హానర్స్ ఇంగ్లీష్ : 4 ఏళ్ల వ్యవధి గల ఈ కోర్సులో 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఏ హానర్స్ ఎకనామిక్స్ : 4 సంవత్సరాల వ్యవధి గల ఈ కోర్సులో 25 సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా…
అర్హులైన విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ( https://ssctucuet.samarth.edu.in/ ) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన బీటెక్ అభ్యర్థులు రూ.500, బీఏ కోర్సుల అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు బీటెక్ కోర్సుకు రూ.250, బీఏ కోర్సులకు రూ.150 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఫీజు చెల్లించిన రశీదును పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఆగస్టు 3, 2026
- మెరిట్ జాబితా విడుదల: ఆగస్టు 5, 2026 కౌన్సెలింగ్
- సీట్ల కేటాయింపు: ఆగస్టు 11, 2026.
ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

