సీయూఈటీ పీజీ 2026-27కి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. సీయూఈటీ పీజీకి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చారు. ఎన్టీఏ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 14వ తేదీ రాత్రి 11.50 గంటలతో ముగిసింది. జనవరి 20, 2026 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. అలాగే జనవరి 23 నుంచి 25 వరకు దిద్దుబాట్లు చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఇచ్చింది.

CUET PG 2026 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు మొదట అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ తరువాత వారు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందుకుంటారు. దీనిని ఉపయోగించి దరఖాస్తు ఫారమ్ పూరించవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా సమాచారంతో పాటు స్కాన్ చేసిన ఫోటోగ్రాఫులు, సంతకాలు, అవసరమైన సర్టిఫికెట్లను (కేటగిరీ సర్టిఫికెట్లు వంటివి) అప్‌లోడ్ చేయాలి.
CUET PG 2026 మూడు షిఫ్టులలో నిర్వహిస్తారు. పరీక్షకు 90 నిమిషాల సమయం ఇస్తారు. సీయూఈటీ పీజీ పరీక్షను 157 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. 292 నగరాలు, 16 అంతర్జాతీయ ప్రదేశాలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో అదనపు పేపర్‌కు రూ.700 ఫీజు విడిగా చెల్లించాలి. ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1200 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్లు రెండు పేపర్లకు రూ.1100 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్లు రెండు పేపర్లకు రూ.1100 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనపు ఫీజు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. దేశం వెలుపల నుంచి వచ్చే అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.7000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి అదనపు పేపర్‌కు రూ .౩5౦౦ రుసుము విడిగా చెల్లించాలి.
రాత పరీక్ష మెుత్తం 74 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. వ్యవధి 90 నిమిషాలు, నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.