ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(NTRUHS) తీపి కబురు అందించింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు మెడికల్ కాలేజీల్లో 17 నూతన అలైడ్, హెల్త్‌కేర్ ప్రొఫెషన్ కోర్సులను ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్(NCAHP) ఆమోదించిన ఈ కోర్సుల పరిచయంపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. అర్హులైన అధ్యాపకుల లభ్యత, మౌలిక వసతులు, నిబంధనల అమలుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు.
రేడియోగ్రఫీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వంటి డిమాండ్ ఉన్న పారామెడికల్ విభాగాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. NCAHP నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా అర్హతల పరిశీలన పూర్తయ్యాకే ఈ కోర్సులకు అనుమతులు మంజూరు చేస్తారు.
వైద్య రంగంలో వైద్యులతో పాటు నైపుణ్యం కలిగిన అలైడ్ హెల్త్‌కేర్ సిబ్బందికి అంతర్జాతీయంగా భారీగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో తక్షణ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాణ్యమైన వైద్య విద్యతో పాటు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వర్సిటీ అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత స్థాయి పారామెడికల్ విద్యను అందుబాటు ధరల్లో అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు పూర్తయిన తర్వాతే ఈ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
'అర్హతగల అధ్యాపకుల లభ్యత, మౌలిక సదుపాయాలు, NCAHP నిబంధనలకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి, ఇప్పటికే ఉన్న అనుబంధ, ఆరోగ్య సంరక్షణ కోర్సులను బలోపేతం చేయడానికి సంబంధించిన ప్రణాళికలను ఈ సమావేశం సమీక్షించింది. అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల జాతీయ కమిషన్ నిర్దేశించిన నియంత్రణ అవసరాలను పూర్తి చేసిన తర్వాత ప్రతిపాదిత కోర్సులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.' అని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}'అర్హతగల అధ్యాపకుల లభ్యత, మౌలిక సదుపాయాలు, NCAHP నిబంధనలకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి, ఇప్పటికే ఉన్న అనుబంధ, ఆరోగ్య సంరక్షణ కోర్సులను బలోపేతం చేయడానికి సంబంధించిన ప్రణాళికలను ఈ సమావేశం సమీక్షించింది. అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల జాతీయ కమిషన్ నిర్దేశించిన నియంత్రణ అవసరాలను పూర్తి చేసిన తర్వాత ప్రతిపాదిత కోర్సులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.' అని అధికారులు చెబుతున్నారు.
{{/usCountry}}