...
...
Next Story

తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక.. 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఇదే రికార్డు

TTD : తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు పెద్ద మెుత్తం కానుక సమర్పించేందుకు రెడీ అయ్యారు. తిరుమల చరిత్రలో స్వామివారికి ఇదే అతిపెద్ద కానుక కానుంది.

Published on: Nov 21, 2026, 18:04:17 IST
Advertisement

తిరుమల శ్రీనివాసుడికి ఓ భక్తుడు భారీ మెుత్తం బంగారం కానుకగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 121 కిలోల బంగారాన్ని స్వామివారికి అందించనున్నారు. మెుత్తం 9 సెట్లుగా 45 ఆభరణాలను ఆ భక్తుడు ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కానుక విలువ సుమారు 160 కోట వరకు ఉంటుందని అంచనా. తిరుమల చరిత్రలో స్వామివారికి ఇదే అతిపెద్ద కానుక కానుంది. నవంబర్ 26వ తేదీన కానుకలను టీటీడీ అందించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారికి భారీ కానుక
తిరుమల శ్రీవారికి భారీ కానుక

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. దేశవిదేశాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అమ్మవారి వాహనసేవలు, దర్శనాల ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాలు, వాహనసేవలు, పంచమితీర్థం ఏర్పాట్లపై తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, భద్రత తదితర అంశాల్లో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పంచమితీర్థం రోజున లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఈవో సూచించారు. భక్తులు వేచి ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేలా తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు వరకు పడి ఊరేగింపుగా వచ్చే మార్గాల్లో అవసరమైన రహదారి మరమ్మతులు చేపట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆలయం లోపల, వెలుపల సుందరమైన పుష్పాలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఉద్యానవన విభాగం సహకారంతో, జేఈవో పర్యవేక్షణలో ఆలయ పరిసరాలను పుష్పశోభతో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఆకర్షణీయమైన విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వాహనసేవలను భక్తులందరూ వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. వాహనసేవల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో విచ్చేసి, అమ్మవారి వాహనసేవలను తిలకించి, దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో కోరారు. భక్తులకు మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు టీటీడీ అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ సమావేశంలో జేఈవోలు డాక్టర్ ఏ. శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks