...
...
Next Story

కూటమి పాలనలో 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా: వైఎస్ జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విపత్తుల సమయంలో సకాలంలో సహాయం అందించడంలో విఫలమైందని ఆరోపించారు.

Published on: Dec 4, 2025, 14:43:06 IST
Advertisement

ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా కల్పించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, విపత్తుల సమయంలో సకాలంలో సహాయం అందించడంలో విఫలమైందని విమర్శించారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

'ఎన్డీఏ సంకీర్ణ పాలనలో 19 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. 84 లక్షల మంది రైతులకు గాను 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా అందింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.' అని జగన్ అన్నారు.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు ఆలస్యంగా అందాయని, కౌలు రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని జగన్ అన్నారు. పండుగలా జరుపుకోవాల్సిన వ్యవసాయం, చంద్రబాబు పాలనలో భారంగా మారిందని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 మధ్య గత వైసీపీ ప్రభుత్వంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. తుపానులు, పంటకోతకు సిద్ధంగా ఉన్న పంటల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం నష్టాలను నివారించలేకపోయిందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఈ-క్రాప్‌ వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు.

అమరావతి భూములపై జగన్ మాట్లాడారు. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు, అమ్మకూడదని చట్టంలో ఉందన్నారు. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe