ఓ పద్ధతి ప్రకారమే 2005 నుంచి హిందూమతంపై దాడి జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమల పరిధిని ఏడు కొండల నుంచి రెండు కొండలకు మాత్రమే పరిమితం చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవో తీసుకువచ్చారని…. అప్పటి నుంచే హిందూ మతంపై క్రమబద్ధంగా దాడి చేస్తూ వచ్చారని ఆక్షేపించారు. అప్పటి పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ అనే క్రైస్తవ అధికారి ఈ జీవో జారీ చేశారని వివరించారు.
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్….

హిందూ సమాజంతో పాటు రెండేళ్ల పాటు తాము చేసిన పోరాటాల కారణంగా వెనక్కు తగ్గారని సీఎం స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై శాసనసభలో చేపట్టిన లఘు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ వ్యవహారంపై మహాపాపం పేరిట అసెంబ్లీలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ హయాంలో 20.01 కోట్ల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి ఘోర అపచారం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. రాజకీయ వివాదం ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సిట్ ఏర్పాటైందని వివరించారు.
తప్పు చేసిన నిందితులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. లడ్డూ వ్యవహారంలో అనేక తప్పులు చేశారని స్పష్టం చేశారు. 2019-24 మధ్య 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని అన్నారు. రూ. 231.51 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని నీరుగార్చారని స్పష్టం చేశారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తానేమి సొంతగా చెప్పలేదని ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చిన నివేదికనే బయటకు వెల్లడించానని అన్నారు.
కల్తీ నెయ్యి సరఫరాకు అనుగుణంగా టెండర్ నిబంధనల్ని సడలించారని.. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సరఫరా చేయాలన్న నిబంధన తొలగించారని పేర్కొన్నారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి 1 ఏడాదికి కుదించారన్నారు. రోజుకు 12 టన్నుల వెన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని 8 టన్నులకు తగ్గించారని పేర్కొన్నారు. అక్రమాలకు తెరతీసేలా డెయిరీల వార్షిక టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పరిమితం చేశారన్నారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారని.. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని కూడా నీరుగార్చారన్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా పోమిల్ జైన్ , విపిన్ జైన్ తో పాటు భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఉందన్నారు.
{{/usCountry}}కల్తీ నెయ్యి సరఫరాకు అనుగుణంగా టెండర్ నిబంధనల్ని సడలించారని.. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సరఫరా చేయాలన్న నిబంధన తొలగించారని పేర్కొన్నారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి 1 ఏడాదికి కుదించారన్నారు. రోజుకు 12 టన్నుల వెన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని 8 టన్నులకు తగ్గించారని పేర్కొన్నారు. అక్రమాలకు తెరతీసేలా డెయిరీల వార్షిక టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పరిమితం చేశారన్నారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారని.. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని కూడా నీరుగార్చారన్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా పోమిల్ జైన్ , విపిన్ జైన్ తో పాటు భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఉందన్నారు.
{{/usCountry}}ఏఆర్, శ్రీవైష్ణవీ, మాల్ గంగా డెయిరీలు భోలే బాబా డెయిరీకి షెల్ కంపెనీలుగా వ్యవహరించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని సీఎం స్పష్టం చేశారు. రూ.4.5 కోట్ల లంచం డబ్బుతో నాటి చైర్మన్ పీఏ చిన్నప్పన్న అడ్డంగా దొరికి పోయారని సీఎం తెలిపారు. తప్పుడు రిటర్నులతో తప్పుదారి పట్టించారని.. ల్యాబ్ నివేదికల్ని కూడా ఫోర్జరీ చేశారన్నారు. ల్యాబ్ ల కన్నుగప్పి టెండర్లు దక్కించుకున్నారని అన్నారు. కల్తీ నెయ్యి తయారీకి, సరఫరాకు ఓ ముఠాగా ఏర్పడ్డారని... తయారికి వివిధ రకాల రసాయనాలు వినియోగించినట్టు కూడా సిట్ తేల్చిందన్నారు.
శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేసి ఘోర అపచారం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. టీటీడీలోని సాంకేతిక నిపుణులకు కూడా ఖరీదైన ఫోన్లు ఎరవేసి కల్తీ నెయ్యికి గేట్లు తెరిచారన్నారు. మోనో గ్లిసరైట్, ఎసిటిక్ యాసిడ్ లాంటి డ్రమ్ములను, లంచాల వివరాలతో కూడిన డైరీని కూడా సిట్ స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఈ కుట్రకు పాల్పడిన నిందితులపై సిట్ అభియోగాలు కూడా మోపిందన్నారు. తప్పు చేసిన వ్యక్తులు ఇప్పుడు మళ్లీ బుకాయించి మాపైనే ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ టీటీడీ బోర్డు చైర్మన్ కు తెలియకుండా జరుగుతాయా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రసాదం తీసుకున్న ప్రతీ ఒక్కరూ నాణ్యత తగ్గిందని చెప్పారని వివరించారు.
లేని పింక్ డైమండ్ చోరీ అంటూ గతంలో తనపై దుష్ప్రచారం కూడా చేశారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. శ్రీవారిని అప్రతిష్టపాలు చేసే కుట్రకు ఇది మరో ఉదాహరణ అని అన్నారు. జంబో పాలక మండలి నియామకంతో రాజకీయ పునరావాసంగా టీటీడీని మార్చేశారని సీఎం అన్నారు. హైకోర్టు తప్పు పట్టటంతో గత పాలకులు ఆ జీవోను వెనక్కు తీసుకున్నారని తెలిపారు. పరకామణిలో చోరీ జరిగితే దానిని కూడా సెటిల్ చేసేందుకు రాజీ ప్రయత్నాలతో పాటు చోరీని సమర్థిస్తూ చులకనగా గత పాలకులు మాట్లాడారని వివరించారు.
2019-24 మధ్య ప్రణాళికా బద్ధంగా హిందూమతంపై దాడి జరిగిందని ఆరోపించారు. మొత్తం 2032 దేవాలయాలపై దాడి జరిగిందని...విగ్రహాలను ధ్వంసం చేశారని వేటిపైనా కేసు పెట్టి సరైన విచారణ చేయలేదన్నారు. రామతీర్ధం, అంతర్వేది రధం, దుర్గగుడి వెండి సింహాల చోరీ లాంటి ఘటనలు చాలా జరిగినా నిందితులపై ఎలాంటి చర్యలూ లేవన్నారు. కూటమి హయాంలో దేవాలయాలపై దాడులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే టీటీడీలో ప్రక్షాళనా చర్యలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాద నాణ్యతను పెంచామని... ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ధృవీకరణ తర్వాతే లడ్డూ తయారీకి వినియోగించే పదార్ధాలు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు చేయలేదు..
కుటుంబ వ్యాపార సంస్థగా ఉన్న హెరిటేజ్ ప్రభుత్వంతో ఎక్కడా ఒప్పందాలు చేసుకుని ఉత్పత్తులు విక్రయించలేదని సీఎం స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ శాఖ హెరిటేజ్ నుంచి ఒక్క కిలో నెయ్యి కూడా కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండానే నీతి నిజాయితీతో హెరిటేజ్ నిలబడిందని శాసనసభలో వివరించారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని సీఎం ఆక్షేపించారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరించి విక్రయిస్తున్న హెరిటేజ్ నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తోందని తెలిపారు.
ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు నెయ్యి విషయంలో అసలు సంబంధమే లేదని వివరించారు. పూణేలో ఉన్న ఇందాపూర్ డెయిరీ ప్రసిద్ధ కంపెనీలన్నిటికీ కో మాన్యుఫాక్చరింగ్ చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. మదర్ డెయిరీ, బ్రిటానియా, ఆయుర్వేద ఘీ పతంజలి, డిమార్ట్, రిలయన్స్, దొడ్ల, హాడ్సన్ , జీఆర్బీ, అముల్, హెరిటేజ్ ప్రముఖ సంస్థలకు ఉత్పత్తుల కో మాన్యుఫాక్చరింగ్ చేస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటన జరిగితే దానిపై చర్చించకుండా మండలిలో అడ్డుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు.