ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా కెంజుట్సులో చేరారు. ఇది అన్ని శాస్త్రీయ జపనీస్ కత్తిసాము పాఠశాలలకు ఒక సాధారణ పదంగా చెబుతారు. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో తాజాగా అధికారిక ప్రవేశం లభించింది. ఇది పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్‌లో కొనసాగిస్తున్న సాధన, పరిశోధన, సంప్రదాయాల పట్ల నిబద్ధతను గుర్తిస్తూ ఈ అరుదైన గౌరవం దక్కింది.
పవన్ కళ్యాణ్
{{^htLoading}} {{/htLoading}}
పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందే మార్షల్ ఆర్ట్స్‌తో సంబంధం ఉంది. చెన్నైలో కరాటే, సంబంధిత విభాగాలలో ఇంటెన్సివ్ శిక్షణ పొందాడు. పవన్ అంకితభావానికి గుర్తింపుగా సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రి కై నుంచి ఫిఫ్త్ డాన్ (5వ డాన్)తో సహా పలు అంతర్జాతీయ గౌరవాలు లభించాయి.
జపాన్ వెలుపల సోకే మురమట్సు సెన్సైలోని టకేడా షింగెన్ క్లాన్‌లో చేరిన మొదటి తెలుగు మాట్లాడే వ్యక్తి పవన్. ఈ గౌరవం జపనీస్ అభ్యాసకులకు అరుదుగా లభిస్తుంది. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ పవన్‌ని టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో కూడా సత్కరించింది. జపాన్ వెలుపల ఈ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది భారతీయుల్లో ఏపీ డిప్యూటీ సీఎం ఒకరు.
కరాటే, యుద్ధకళల్లో కఠిన శిక్షణ పొందారు పవన్ కళ్యాణ్. శారీరక సాధనకే పరిమితం కాకుండా.. జపనీస్ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం కూడా చేశారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గ దర్శకత్వంలో కెండోలో శిక్షణ పొందారు. పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో ఈ యుద్ధ కళలకు ప్రచారం కల్పించిన విషయం తెలిసిందే.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
Home/Andhra Pradesh/పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం.. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్
{{^htLoading}}
Advertisement
{{/htLoading}}
SHARE THIS ARTICLE ON
{{#usCountry}}{{/usCountry}}
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe