...
...
Next Story

ఏపీలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ఇందుకు అసలు కారణాలు ఏంటి?

AP Petrol and Diesel Shortage : ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సెగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

Published on: Apr 26, 2026, 12:08:03 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటం సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. కొన్ని బంకుల్లో నో డీజిల్ కనిపిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో నో పెట్రోల్ బోర్డు అగుపిస్తోంది.

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (HPCL, BPCL, IOCL) డీలర్లకు ఇచ్చే సరఫరాలో కోత విధించడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగినా, దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో కంపెనీలు నష్టాలను తగ్గించుకునేందుకు సరఫరాను నియంత్రిస్తున్నాయి.

గతంలో డీలర్లకు ఉన్న క్రెడిట్ సౌకర్యాన్ని కంపెనీలు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నగదు చెల్లిస్తేనే స్టాక్ పంపే నిబంధనలు పెట్టడం చిన్న స్థాయి డీలర్లకు భారంగా మారింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ అయిపోతుందనే భయం జనాలను వెంటాడుతూ ఉంది. రెండుమూడు లీటర్లు కొట్టించుకునేవారు కూడా ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారు.

డీజిల్ కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది. సరుకు రవాణా వాహనాలు నిలిచిపోతే కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని చోట్ల ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

మరోవైపు వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. ఇంకోవైపు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అధికారులు స్టాక్ ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. జనాలు మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలైన్లు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద టిన్నులతో బంకుల దగ్గర జనం క్యూ కడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe