...
...
Next Story

పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక భూమి - సత్యసాయి జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Published on: Nov 19, 2025, 11:01:38 IST
Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.

పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ
పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ముందు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.

పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి - ప్రధాని మోదీ

పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అని… సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారని గుర్తు చేశారు.

ప్రేమ, సేవకు సత్యాసాయి బాబా ప్రతిరూపంగా నిలిచారన్న ప్రధాని మోదీ.. భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయని అభిప్రాయపడ్డారు. బాబా జీవితం.. వసుధైక కుటుంబం అనే భావనతో సాగిందన్నారు. బాబా బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి.. బాబా సేవే పరమావధిగా భావించారని కొనియాడారు. అంతకు ముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks